Share News

ABC Juice Benefits: ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి.. దాని వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?

ABN , Publish Date - Jan 29 , 2024 | 07:15 PM

శారీరక శ్రమ లేకపోవడం వల్ల, పోషక విలువలు లేని ఆహారం వల్ల ప్రస్తుతం చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, నిల్వ చేసిన ఆహారం చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాహారం గురించి నిపుణులు పలు రకాల సూచనలు చేస్తున్నారు.

ABC Juice Benefits: ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి.. దాని వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?

శారీరక శ్రమ లేకపోవడం వల్ల, పోషక విలువలు లేని ఆహారం వల్ల ప్రస్తుతం చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, నిల్వ చేసిన ఆహారం చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాహారం గురించి నిపుణులు పలు రకాల సూచనలు చేస్తున్నారు. తాజాగా ఏబీసీ జ్యూస్ (ABC Juice) తెర మీదకు వచ్చింది. ఈ జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి? ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? (ABC Juice Benefits)


ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి?

abc2.jpg

యాపిల్ (Apple), బీట్‌రూట్ (Beetroot), క్యారెట్‌ (Carrot)లతో ఏబీసీ జ్యూస్‌ను తయారుచేస్తారు. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లు విడివిడిగా మంచి పోషక విలువలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ మూడింటిని కలిపి తయారు చేసేదే ఏబీసీ జ్యూస్. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అలాగే శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు (Food and Health).


యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక, మూడింటి మిశ్రమాన్ని తీసుకోవడం శరీరానికి మరింత మేలు చేస్తుంది. ఈ జ్యూస్ వల్ల శరీరంలోకి చేరే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. అంతేకాదు.. ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

abc3.jpg


ఈ ఏబీసీ జ్యూస్ వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పొటాషియం లభిస్తుంది. అందువల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ జ్యూస్‌ని తాగితే మంచిది. ఇక, శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో కూడా ఈ ఏబీసీ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చర్మ సంబంధ సమస్యల నుంచి కాపాడుతుంది. బరువును నియంత్రణలో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.

Updated Date - Jan 29 , 2024 | 07:15 PM