Pills with Water : ట్యాబ్లెట్స్ వేసుకునేప్పుడు ఎంత నీటిని తాగుతున్నారు?
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:09 PM
కొంతమంది కొద్దిగా మాత్రమే నీరు తాగితే మరి కొంత మంది నీటితోనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. మరికొంతమంది అసలు నీళ్ళు తాగరు.
అనారోగ్యంతో ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్ వేసుకుంటూ ఉంటాం. ఇలా మందులు వేసుకునే సమయంలో మనం అంతా తెలీకుండా చేస్తున్న తప్పుల్లో ముఖ్యంగా మందులు వేసుకునే సమయంలో ఎంత నీటిని తీసుకోవాలి అనేది తెలియక మింగేస్తూ ఉంటారు. కొందరు ముందుగా ట్యాబ్లెట్ మింగేసి, తర్వాత నీరు తాగుతారు. కొందరైతే నీరు ముందుగా గొంతులో వేసుకుని తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అసలు ట్యాబ్లెట్స్ వేసుకునే టైంలో ఎంత వరకూ వాటర్ తీసుకోవాలి అనే విషయం ఎవరికీ కచ్చితంగా తెలీదు. నీరు ఎందుకు తాగాలి, ఎంతవరకూ తాగాలనే విషయాన్ని తెలుసుకుందాం.
అయితే ట్యాబ్లెట్స్ వేసుకున్న సమయంలో ఖచ్చితంగా నీరు తీసుకోవాలి..
టాబ్లెట్ వేసుకున్నాక ఒక పూర్తి గ్లాసు నీటిని తాగడం వల్ల పూర్తిగా కరిగి ఫలితాన్ని ఇస్తుంది. నీటిని తక్కువ తాగితే టాబ్లెట్ కరగదు. పైగా పేగులకు అంటుకుని ఉండే అవకాశం కూడా ఉంది. టాబ్లెట్స్ ఎన్ని ఉన్నా సరే ఒక గ్లాస్ నీటిని మాత్రమే తాగితే సరిపోతుంది. గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని తీసుకోవడం వల్ల త్వరగా కరుగుతాయి.
ఇలా చల్లని నీరు శరీరంలోకి వెళ్లిన తర్వాత వేడిగా మారటానికి శరీరం నుండి ఎక్కువ శక్తి ఉపయోగించవలసి ఉంటుంది. చల్లని నీటిలో టాబ్లెట్ తొందరగా జీర్ణం కాక సరైన ఫలితం ఇవ్వదు. అందుకే గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి : ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..!
ట్యాబ్లెట్స్ వేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రూల్ ఫాలో అవుతారు. కొంతమంది కొద్దిగా మాత్రమే నీరు తాగితే మరి కొంత మంది నీటితోనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. మరికొంతమంది అసలు నీళ్ళు తాగరు. కానీ, ట్యాబ్లెట్ నీటితో శరీరంలోకి వచ్చినప్పుడే అవి త్వరగా కరిగి బాడీలో పని చేస్తుంది. బెనిఫిట్స్ ఉంటాయి. తాగాలి కాబట్టి, ఎక్కువగా నీరు తాగొద్దు. కొన్ని ఎక్కువ డోసేజ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి.
వీటిని తీసుకునే టైమ్‌లో నీరు ఎక్కువగా అంటే గ్లాసు నీరు తాగాలి. కొంతమంది అసలే నీరు తాగరు. కానీ, దీని వల్ల పొట్టలో అసిడిటీ, అల్సర్స్ వంటి సమస్యలొస్తాయి. హెల్త్ కండీషన్ బట్టి, మాత్రల రకాన్ని బట్టి నీటిని తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)