Share News

Womens Beauty: అమ్మాయిల అందాన్ని దాంతో కొలుస్తారా.. ఎంత విచిత్రం..

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:45 PM

ప్రపంచంలో ఏ వస్తువుని కొలవడానికైనా ఎదొక పరికరం ఉంటుంది. అయితే, ఒక అమ్మాయి అందాన్ని కొలవడానికి కూడా ఓ పరికరం ఉంటుందని మీకు తెలుసా? అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Womens Beauty: అమ్మాయిల అందాన్ని దాంతో కొలుస్తారా.. ఎంత విచిత్రం..

Womens Beauty: ప్రపంచంలో ఏ వస్తువుని కొలవడానికైనా ఎదొక పరికరం ఉంటుంది. పరికరాల్లో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం దాదాపు సేమ్ గానే ఉంటుంది. అయితే, మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రం ఏ పరికరం లేదు.. కానీ, మనిషి అందాన్ని కొలిచే పరికరం మాత్రం ఒకటి ఉందట. అయితే, ఆ పరికరం మాత్రం మార్కెట్‌లో ఎక్కడ కూడా దొరకదు. మరి ఆ పరికరం ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎలా కొలుస్తారు? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం..

అందాన్ని కొలిచే పరికరం..

అమ్మాయిల అందాన్ని చూసి అబ్బాయిలు ఎంతగా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ఫంక్షన్ లకు వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా అబ్బాయిలు ముందుగా అమ్మాయిల కోసం చూస్తుంటారు. అలా చూసిన అమ్మాయిల్లో ఒక అబ్బాయికి నచ్చిన అమ్మాయి మరో అబ్బాయికి నచ్చాలి అనే రూల్ లేదు. ఎందుకంటే అమ్మాయి అందాన్ని కొలిచే పరికరం ఫలితంపై ఉంటుంది. అసలు పరికరం ఏంటి అని అనుకుంటున్నారా.. అదేనండి అబ్బాయిల మనసు.. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అందరికి నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. అమ్మాయిల విషయంలో అబ్బాయిలు కేవలం మనసుకు నచ్చినట్లుగానే ఉంటారు తప్ప మరి ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా లెక్క చేయరు. మనస్సు ఏం చెబితే అది చేస్తారు. అమ్మాయి నచ్చితే చాలు ఇక ముందు వెనుక ఆలోచించకుండా నచ్చింది చేస్తాడు.

ఎట్టిపరిస్థితిలోనూ..

ముఖ్యంగా పెళ్లి విషయంలో అబ్బాయికి అమ్మాయి నచ్చితే.. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా ఆ అమ్మాయే కావాలంటూ ఇంట్లో తేల్చిచెబుతాడు. మనసు విషయంలో ఎట్టిపరిస్థితిలోనూ కాంప్రమైజ్ అవ్వడు. ఇలా ఏది ఏమైనా ఒక మనిషి అందాన్ని అంచనా వేసేది మాత్రం మనసు మాత్రమే. మనసు పరికరం కాదు కాదా.. ఎలా అనుకుంటున్నారా.. హార్ట్ అనేది పరికరం కాకపోయినా అది పరికరం లా పని చేస్తుంది కాబట్టి మనసుని ఒక పరికరంలా భావిస్తారనే అంచనా. అందుకే చాలా విషయాల్లో వ్యక్తిగత డెసిషన్ తీసుకునే అప్పుడు కేవలం మనసుకు నచ్చినట్లు నిర్ణయం తీసుకోవాలని అంటారు. అది కూడా మనస్ఫూర్తిగా తీసుకుని చెప్పమంటారు. అలా చెప్పిన మాట ప్రకారం మనసుకు నచ్చినట్లు కట్టుబడి ఉంటారు. అలాంటి మనసు అమ్మాయి అందాన్ని అంచనా వేస్తుంది.

Updated Date - Nov 13 , 2024 | 01:46 PM