Share News

TEA: బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:12 AM

కొంతమంది రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగుతారు. అలా తాగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

TEA:  బీ కేర్ ఫుల్... టీ ఇన్ని కప్పులు తాగితే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు..
Tea

TEA: చాలా మంది నిద్రలేవగానే చేసే మొదటి పని టీ తాగడం. టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అదే టీని అతిగా తాగితే అనేక దుష్ప్రభావాలు కూడా అంతే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే టీ కప్పులు కప్పులు తాగుతుంటారు. అయితే, రోజూ అలా టీని అతిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ ఎక్కువగా తాగితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

నిద్రలేమి:

టీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది నిద్ర వచ్చే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. టీ తాగడం వల్ల నిద్ర లేమి సమస్యలు వస్తాయి. నిద్రలో ఆందోళన చెందడం, కలలు కనడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గుండె సమస్యలు:

కెఫిన్ కలిగిన టీని రోజు ఎక్కువసార్లు తాగడం వల్ల గుండె స్పందన రేటు కూడా వీపరితంగా పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుండె సమస్యలు ఉన్న వారు టీ తాగడం మానుకుంటే ఎంతో మంచిది. అంతేకాకుండా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగడం వల్ల గుండె నరాలు సంకోచితమై అనేక సమస్యలకు దారి తీయవచ్చు. కొంతమందికి రక్తపోటు సమస్య వచ్చి త్వరలోనే గుండె జబ్బులు కూడా ప్రారంభవుతాయని వైద్యులు చెబుతున్నారు. గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

జీర్ణ సమస్య:

టీ అతిగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగడం వల్ల గుండె ప్రభావితమవుతుంది. ఈ కారణంగా అజీర్ణం, ఎసిడిటీ మంట, మలబద్ధకం వంటి అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పొట్ట ఉబ్బరం కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఐరన్ లోపం:

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఎక్కువ టీ తాగడం వల్ల ఐరన్ లోపం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడుతున్న చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా టీ తాగడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎముకల ఆరోగ్యం:

టీలో ఉండే కెఫిన్ ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎముకల బలహీనత సమస్యలు వచ్చి సులభంగా విరిగిపోవడం ఇతర సమస్యలు వంటివి వస్తాయి. అంతేకాకుండా ఎముకలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి.

కిడ్నీ సమస్య:

టీలో ఉండే ఆక్సలిన్ వల్లే చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలపై ప్రభావం చూపి రాళ్లు, ఇతర వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా కిడ్నీలు పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

(Note: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.)

Updated Date - Nov 13 , 2024 | 10:15 AM