Share News

Boys: అబ్బాయిలు బీ అలర్ట్..30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో ఇబ్బంది..

ABN , Publish Date - Nov 25 , 2024 | 07:24 PM

అబ్బాయిలకు పెళ్లి చేసుకోవాలనే మనసు ఉన్నా, మంచి ఉద్యోగం, హోదా వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అందుకే 30 నుంచి 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే, 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో ఇబ్బందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Boys: అబ్బాయిలు బీ అలర్ట్..30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో ఇబ్బంది..

పెళ్లీడుకు బెస్ట్ ఏజ్: పెళ్లి ఎప్పుడు అనేది అందరినీ వేధించే ప్రశ్న. అది వారి వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం మంచిది. ఒక వ్యక్తికి ఒక వయస్సు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ, స్నేహితులు, బంధువులు అతనిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తారు. ఇది చాలా సాధారణ విషయం. ఇటీవల 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా పెళ్లిని ఆలస్యం చేయడం వల్ల జీవితంలో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి జాప్యం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

బిజీ లైఫ్‌స్టైల్‌..

ప్రస్తుత తరం ప్రజలు కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉన్నారు. నేటి యువత చదువులు, ఉద్యోగాలతో పాటు బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే మనసు ఉన్నా, మంచి ఉద్యోగం, హోదా వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అందుకే 30 నుంచి 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత సమస్యలు రాకుండా పెళ్లికి ముందు జాగ్రత్తలు తీసుకుని సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే మంచిదని చాలామంది అనుకుంటారు.


బాధ్యతల తర్వాతే..

పూర్వకాలంలో తండ్రి పని చేస్తేనే పిల్లలు జీవించేవారు. కానీ ఇప్పుడు కాలం చాలా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది తమ బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కుటుంబ బాధ్యత, ఆర్థికంగా ఎదగడం, ఇల్లు కట్టుకోవడం వంటి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మరి కొంత మంది లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్‌లో ఉండి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలా రకరకాల కారణాల వల్ల పెళ్లి ఆలస్యమవుతోంది.

పిల్లలు పుట్టడంలో..

అయితే, 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకునే వారికి పిల్లలు పుట్టడంలో చాలా సమస్యలను ఎదురవుతాయి. ఎందుకంటే స్త్రీలలో గర్భధారణ సామర్థ్యం, పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా 30 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో ఎలా స్థిరపడాలి, ఎలా సంపాదించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పెళ్లి ఆలస్యమైతే పిల్లలకు యుక్తవయస్సు వచ్చే నాటికి తల్లిదండ్రులకు ముసలితనం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Also Read:

భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా.. మన చట్టం ఏం చెబుతుంది..

Updated Date - Nov 25 , 2024 | 07:43 PM