Technology : వైఫై నుంచి అటాక్!
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:35 AM
విండోస్ అప్డేట్‌ను వాయిదా వేస్తుంటే సరిగ్గా ఇప్పుడు ఆ పని అంటే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
విండోస్ అప్డేట్‌ను వాయిదా వేస్తుంటే సరిగ్గా ఇప్పుడు ఆ పని అంటే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన పీసీల్లో రిస్క్ ఉందన్న విషయాన్ని మైక్రోసాఫ్ట్ గమనించింది. అందుకనే విండోస్ 11, 10విండోస్‌ను ఇప్పుడు అప్డేట్ చేసుకోవడం మంచిది అంటోంది. ‘ద రిజిస్టర్’ దీన్ని ముందు గుర్తించింది. విమానాశ్రయాలు, కాఫీ షాపులు లేదంటే వర్క్‌ప్లేసుల్లో ముఖ్యంగా పబ్లిక్ వైఫైతో కనెక్ట్ అయ్యే డివైజుల్లో ఈ ప్రమాదం పొంచి ఉంది. యూజర్ ఇంటరాక్షన్ లేదంటే అథెంటికేషన్‌తో హ్యాకర్ రిమోట్ నుంచి డివైజ్‌ను స్వాధీనం చేసుకోగలుగుతారు. ఈ ప్రమాదాన్ని ‘ఇంపార్టెంట్’గా మైక్రోసాఫ్ట్ పేరుపెట్టింది. భద్రతపరమైన రిస్క్‌ల్లో దీన్ని రెండో పెద్ద థ్రెట్‌గా పేర్కొంది. ప్యాచ్ విషయంలో ఆలస్యం చేస్తే ముప్పు తప్పదని హెచ్చరించింది.