Share News

Kajol Devgan : యాభైల్లోనూ ఇరవైలా..!

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:10 AM

ఇరవైల్లో నాజూగ్గా కనిపించడంలో వింతేమీ లేదు. కానీ... యాభైల్లోనూ అదే శారీరక సౌందర్యంతో అలరిస్తుంటే..! కాజోల్‌ దేవ్‌గణ్‌..! కిలకిల నగవులు... మిలమిల మెరుపులతో ఒకప్పుడు వెండితెరను ఏలిన సితార. పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా... ఇద్దరు బిడ్డల తల్లి అయినా... ఆమెలో నేటికీ అదే ఆకర్షణ.

Kajol Devgan :  యాభైల్లోనూ ఇరవైలా..!

సెలబ్‌ ఫిట్‌

ఇరవైల్లో నాజూగ్గా కనిపించడంలో వింతేమీ లేదు. కానీ... యాభైల్లోనూ అదే శారీరక సౌందర్యంతో అలరిస్తుంటే..! కాజోల్‌ దేవ్‌గణ్‌..! కిలకిల నగవులు... మిలమిల మెరుపులతో ఒకప్పుడు వెండితెరను ఏలిన సితార. పరిశ్రమలోకి వచ్చి మూడు దశాబ్దాలు దాటినా... ఇద్దరు బిడ్డల తల్లి అయినా... ఆమెలో నేటికీ అదే ఆకర్షణ.

వెండితెర మీదే కాదు... వేదిక ఏదైనా కాజోల్‌ ఉందంటే అక్కడ పదివేల ఓల్టుల ఎనర్జీ. వాతావరణం ఉత్సాహంగా... ఉల్లాసంగా మారిపోతుంది. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్‌ కుచ్‌ హోతాహై, కభీ ఖుషీ ఖభీ గమ్‌’... లాంటి ఆణిముత్యాలు ఆమె కెరీర్‌లో ఎన్నో. పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రలతో... ఇండస్ర్టీ హిట్స్‌కు ఒకప్పుడు కేరాఫ్‌ అడ్రెస్‌. స్కూల్లో చదివే రోజుల్లోనే పరిశ్రమలోకి అడుగుఎట్టిన కాజోల్‌... ఉత్తమ నటిగా ఐదు ఫిలిమ్‌ఫేర్‌ అవార్డులతో కలిపి నలభైకి పైగా పురస్కారాలు అందుకుంది. సినీ రంగానికి చేసిన అసమాన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2011లో కాజోల్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలనాటి నటి తనూజా ముఖర్జీ వారసురాలిగా కెమెరా ముందుకు వచ్చినా... అద్భుతమైన నటనతో తల్లిని మరిపించింది.

Untitled-1 copy.jpg

ఆమె కుటుంబం మొదటి నుంచీ సినీ రంగంతో మమేకమైంది. తండ్రి సోము ముఖర్జీ దర్శకనిర్మాత. అమ్మమ్మ శోభనా సమ్మర్థ్‌, అత్తయ్య నూతన్‌, మామయ్యలు జాయ్‌ ముఖర్జీ, దేవ్‌ ముఖర్జీ, చెల్లి తనీషా... ఇలా చెప్పుకొంటూ పోతే, ఆమె దాదాపు అందరూ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. చిన్నప్పుడే తల్లితండ్రులు విడిపోయినా... ఆ ప్రభావం తనపై పడనివ్వలేదు ఆమె అమ్మమ్మ. కాజోల్‌ స్వతంత్ర భావాలతో పెరిగింది. ఏదైనా పట్టుపడితే అది నెరవేరే వరకు వదలదు. అమ్మ నుంచి మహారాష్ట్ర సంస్కృతి, నాన్న నుంచి బెంగాలీ సంప్రదాయం అలవర్చుకుంది. స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు... నైసా, యుగ్‌. ఇప్పటికీ పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న కాజోల్‌... తెరంగేట్రం చేసి మూడు దశాబ్దాలు దాటింది. అయినా నేటికీ ఆమెలో అదే జోష్‌. అదే నాజూకైన రూపం. అందుకే నడివయసువారికే కాదు... యువతరానికి కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తోంది.


  • పది గంటల నిద్ర...

కోజోల్‌ జీవనశైలి చూడ్డానికి చాలా సాధారణంగా ఉటుంది. కానీ పోషక విలువలున్న ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఆమె జీవితంలో భాగం. అదే తనను ఆరోగ్యంగా, నిత్యయవ్వనంగా ఉంచుతుందని అంటుంది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. అన్నిటికంటే ముఖ్యంగా రోజుకు కనీసం పది గంటలు నిద్ర పోతుంది. ‘పడుకొనే ముందు శుభ్రంగా ముఖం కడుక్కోకపోతే నాకు నిద్ర పట్టదు. ఎంత బిజీగా ఉన్నా రోజూ కచ్చితంగా పది గంటలు నిద్ర పోవాల్సిందే’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె నిద్ర గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగేది. భర్త అజయ్‌దేవ్‌గణ్‌ కూడా ఓసారి ‘ఇక నిద్ర పోయింది చాలు’ అంటూ ఆమె ఫొటోతో ట్వీట్‌ చేశాడు.

అదేవిధంగా చర్మ సౌందర్యానికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది కాజోల్‌. ఇంత మందాన ముఖానికి రంగులు పులిమేయకుండా... సింపుల్‌ మేక్‌పతో కనిపించడానికే ఇష్టపడుతుంది. ఆమె కిట్‌లో సన్‌స్ర్కీన్‌ లోషన్‌ తప్పనిసరి. ‘పదహారేళ్ల వయసులో నాకు సన్‌స్ర్కీన్‌ ప్రయోజనం గురించి తెలిసింది. అప్పటి నుంచి వాటిని ఉపయోగిస్తున్నా. అంతేకాదు... పుష్కలంగా నీళ్లు తాగుతాను. దానివల్ల చర్మానికి నిగారింపు వస్తుంది’ అంటుంది.


  • వర్కవుట్‌ ఇలా...

శరీరంలో సత్తువ, జీవక్రియ పెంపొందించడానికి రోజుకు కనీసం రెండు గంటలు వర్కవుట్స్‌కు కేటాయిస్తుంది కాజోల్‌. వీటిల్లో వెయిట్‌, ఎండ్యూరెన్స్‌ ట్రైనింగ్‌తో పాటు యోగా కూడా ఉంటుంది. రెండో కాన్పు తరువాత కాజోల్‌ కేవలం ఐదు నెలల్లో ఇరవై కిలోల బరువు తగ్గింది.

  1. ఉదయం అరగంట జిమ్‌లో కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌లు. అప్పుడప్పుడూ స్విమ్మింగ్‌. ఇరవై నిమిషాలు వెయిట్‌లిఫ్టింగ్‌ సెషన్‌. డెడ్‌లిఫ్ట్‌ ఆమె ఫేవరెట్‌ వ్యాయామం. దానివల్ల అధిక మొత్తంలో కేలరీలు కరుగుతాయి. శరీరం దృఢంగా మారుతుంది.

  2. తరువాత స్క్వాట్స్‌, లంగెస్‌, పిలెట్స్‌. డ్యాన్స్‌ కూడా ఆమె వ్యాయామాల్లో భాగం.

  3. అరగంట యోగా, ధ్యానం. యోగా శరీరాన్ని ఫెక్సిబుల్‌గా ఉంచుతుంది. ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కుదురుతాయి.


  • జంక్‌ఫుడ్‌కు దూరం...

పిండి పదార్థాలు తక్కువ మోతాదులో, పీచు పదార్థాలు పుష్కలంగాగల స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహారంతో ఆమె మెనూ నిండివుంటుంది. అలాగే చేప, చికెన్‌ మెనూలో తప్పనిసరి. పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంక్‌, ప్రాసె్‌సడ్‌ ఫుడ్స్‌కు దూరం. ఆ మధ్య అతిథుల కోసం కాజోల్‌ తన ఇంట్లో ఇచ్చిన విందుకు సంబంధించి, రకరకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ ఫొటో ఒకటి ఇన్‌స్టాగారమ్‌లో పోస్ట్‌ చేసింది. పాలక్‌ పనీర్‌, గార్లిక్‌ బ్రెడ్‌, ఫిష్‌ ఫ్రై, స్పైసీ మహారాష్ర్టియన్‌ పట్వాడీ, దాల్‌ రైస్‌ అందులో కొన్ని వంటలు. ఆ విందుకు ఆమె ఓ కొత్త పేరు పెట్టింది... ‘లిండర్‌’ అని. అంటే లంచ్‌, డిన్నర్‌లను అలా కలిపేసిందన్నమాట. ఆహాయ నియమాల విషయంతో ఎంత కచ్చితంగా ఉన్నా... అప్పుడప్పుడు నచ్చిన వెరైటీలను ఓ పట్టు పడుతుంది ఈ భామ. భర్త అజయ్‌ దేవ్‌గణ్‌లానే ఆమెకు చైనీస్‌, గోవా ఫుడ్స్‌ చాలా ఇష్టం. కాజోల్‌ షెఫ్‌లను తలదన్నే అద్భుతమైన కుక్‌ కూడా.

Updated Date - Sep 21 , 2024 | 01:13 AM