Share News

Kitchen : ముంగోడీ ఔర్‌ టమోటర్‌ కా సాలన్‌

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:40 AM

పెసరపిండి- 100 గ్రాములు, శనగపిండి- నాలుగు టీ స్పూనులు, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

Kitchen : ముంగోడీ ఔర్‌ టమోటర్‌ కా సాలన్‌

  • ముంగోడీలకు కావాల్సిన పదార్థాలు

పెసరపిండి- 100 గ్రాములు, శనగపిండి- నాలుగు టీ స్పూనులు, నూనె- తగినంత, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

  • సాలన్‌కు కావాల్సిన పదార్థాలు

తరిగిన టమోటా ముక్కలు- అర కిలో, పెసర పప్పు పకోడీలు- 150 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లం వెల్లులి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూను, కారం- అర టీస్పూను, పసుపు- అర స్పూను, తరిగిన కొత్తిమీర- అరకప్పు, నూనె- అర కప్పు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని

  • తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో పెసరపిండి, శనగపిండిలను నీళ్లతో కొద్దిగా గట్టిగా కలపాలి. దానిలో తగినంత ఉప్పు వేయాలి.

  2. ఒక మూకుడులో నూనెను వేసి- పెసరపిండి మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి వేయించాలి. ఇలా వేగిన పకోడీలను ఒక ప్లేటులో పెట్టి చల్లార్చాలి.

  3. అదే మూకుడులో మరి కొంత నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించాలి. ఆ తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి.

  4. ఆ తర్వాత కారం, పసుపు, ఒక పావు కప్పు తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమోటా ముక్కలను వేయాలి. తగనన్ని నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి- నూనె పైకి తేరుతున్న సమయంలో మూంగోడీలను వేసి మరి కొంత సేపు ఉడకనివ్వాలి.

  • జాగ్రత్తలు

  1. మూంగోడీలు లేకపోతే సోయా ముక్కలను కూడా వాడవచ్చు.

  2. మూంగోడీల తయారీలో శనగపిండికి బదులుగా బియ్యపు పిండి కూడా వాడవచ్చు.

  3. దేశీ టమోటాలను వాడితే ఎక్కువ రుచిగా ఉంటుంది.

  4. దీనిని చపాలతీలలో కానీ వేడి అన్నంలో కానీ తింటే బావుంటుంది.

Updated Date - Sep 21 , 2024 | 12:40 AM