Share News

Delicious Coffee : కమ్మని కాఫీ తాగేద్దామా!

ABN , Publish Date - Oct 28 , 2024 | 05:13 AM

కాఫీని ఇష్టపడనివారుండరు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్‌. కాఫీ తాగినపుడు అందులో ఉండే కెఫిన్‌ వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతమవుతుంది.

Delicious Coffee : కమ్మని కాఫీ తాగేద్దామా!

కాఫీని ఇష్టపడనివారుండరు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్‌. కాఫీ తాగినపుడు అందులో ఉండే కెఫిన్‌ వల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతమవుతుంది. మనసు ఉత్తేజంగా అనిపిస్తుంది. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి. ఇలా కాఫీ అందించే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

  • కాఫీలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, పాస్ఫరస్‌, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు, తక్కువ పరిమాణంలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, బి, కె విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

  • రోజుకు రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల డోపమైన్‌ హార్మోన్‌ నియంత్రణలో ఉండి కుంగుబాటు సమస్యను నిరోధిస్తుంది. కరోనరీ గుండె జబ్బులు, కార్డియోవాస్కులర్‌ రుగ్మతలు, టైప్‌-2 డయాబెటిస్‌ సమస్యలు తగ్గుతాయి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్‌ ఆమ్లాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కళ్లను రెటినాల్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కాపాడతాయి.

  • మెదడు, వెన్నెముకల్లోని నరాల రక్షణ కవచాన్ని దెబ్బతీసే ప్రొ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ అణువుల ఉత్పత్తిని కెఫిన్‌ అడ్డుకుంటుందనీ అందుకే ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.

  • తరచూ కాఫీ తాగడం వల్ల కాలేయంలో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయంలో అత్యధిక ఎంజైమ్‌ల ఉత్పత్తి, కాలేయ క్యాన్సర్‌, ఫైౖబ్రోసిస్‌ వంటి సమస్యల నివారణకు కెఫిన్‌ తోడ్పడుతుంది.


  • మహిళలు రోజూ కాఫీ తాగితే మెనోపాజ్‌ తరవాత రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. కాఫీలోని బయో యాక్టివ్‌ సమ్మేళనాలు పెద్దపేగు క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌. ఓరల్‌ క్యాన్సర్లను నిరోధిస్తాయి.

  • కాఫీ పొడిని స్వచ్చమైన పాలతో కలిపి తాగాలి. బ్లాక్‌ కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. చక్కెరలేని కాఫీ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తరవాత వచ్చే అలసట తగ్గుతుంది. ఆస్తమా, మూత్రపిండాల్లో రాళ్లు, దంతక్షయ సమస్యలు, తలనొప్పి, మలబద్దకం, అల్జీమర్స్‌ రాకుండా చేస్తుంది. భోజనం తరవాత, ఖాళీ కడుపుతో, రాత్రి పడుకొనే ముందు కాఫీ తాగకూడదు. దీనివల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

Updated Date - Oct 28 , 2024 | 05:13 AM