మీకు తెలుసా?
ABN , Publish Date - Apr 28 , 2024 | 04:44 AM
అంటార్కిటికా, ఆస్ర్టేలియాలో కాకుండా మిగతా ప్రపంచంలో 285 రకాల ఉడుతలున్నాయి. కొన్ని చెట్లమీద, నేలమీద బతుకుతాయి. ఎగిరే ఉడుతలు కూడా ఉంటాయి.
అంటార్కిటికా, ఆస్ర్టేలియాలో కాకుండా మిగతా ప్రపంచంలో 285 రకాల ఉడుతలున్నాయి. కొన్ని చెట్లమీద, నేలమీద బతుకుతాయి. ఎగిరే ఉడుతలు కూడా ఉంటాయి.
వెనక కాళ్లలోని డబుల్ జాయింట్ వల్ల ఇవి వేగంగా చెట్ల మీద పరిగెత్తగలవు. 20 ఫీట్లను సునాయసంగా ఎగరగలవు.
తన తోటి ఉడుతలను వాసనతో ఎక్కడున్నా కనుక్కోగలవు. వీటి చూపు అద్భుతం.
ఇవి చాలా తెలివైనవి ఇతర జంతువులను చూసి ఇట్టే నేర్చుకోగలవు.
తన శరీరానికి 180 డిగ్రీల కోణం ఎగరగలవు.
చలికాలం కోసం గింజలను దాచుకునే గుణం వీటికి ఉంది.
తన శరీరం బరువు ఎంత ఉంటే అంత ఆహారాన్ని వారంలో తింటాయి.
వీటి తోక స్పాంజిలా ఉంటుంది. అయితే చురుగ్గా కదిలేది దానివల్లే. వాన, గాలి, మంచునుంచి తోకతోనే రక్షించుకుంటుంది.
ఉడుతలు 30 మీటర్లు పైనుంచి దూకినా ఏమీ కాదు. ఎందుకంటే వీటి బరువు తక్కువ. దీంతో పాటు గాలిలో తనకు తాను నియంత్రించుకుంటూ.. భూమ్యాకర్షణకు లోనుకాకుండా పడుతుంది. ఇందుకు ఉడుత శరీరమే కారణం. అందుకే కిందపడినా ఉడుతలు చనిపోవు.
ఆకులు, ఎండు కొమ్మలతో గూళ్లు కట్టుకుంటాయి.
ఉడుతలు బ్రతికి ఉన్నంత కాలం వాటి దంతాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ దంతాలు 15 సెం.మీ.దాకా పెరుగుతాయి.