మీకు తెలుసా?
ABN , Publish Date - Jan 27 , 2024 | 11:36 PM
చూడచక్కని అందం.. పసుపు పచ్చరంగు.. నల్లటి చుక్కల శరీరం.. పక్కన రెక్కలు.. చూడటానికి ఓ పెట్టెలా ఉండే ఈ చేపను ‘ఎల్లో బాక్స్‌ఫిష్’ అని పిలుస్తారు.
చూడచక్కని అందం.. పసుపు పచ్చరంగు.. నల్లటి చుక్కల శరీరం.. పక్కన రెక్కలు.. చూడటానికి ఓ పెట్టెలా ఉండే ఈ చేపను ‘ఎల్లో బాక్స్‌ఫిష్’ అని పిలుస్తారు.
పది ఇంచుల నుంచి 24 ఇంచుల పొడవు ఉంటుంది.
హిందూ మహాసముద్రం, అరబిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో ఇవి కనపడతాయి.
నాచు, చిన్న చేపలను తిని బతికే ఈ చేపకు అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం వీటికి ఉంటుంది.
ఆస్టాక్‌టాక్సిన్ అనే పదార్థాన్ని వెదజల్లుతుంది. ఇది నీటిలోకి చేరిన తర్వాత విషంగా మారుతుంది. మనిషి లేదా ఏ ఇతర జీవుల రక్తకణాలపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే అందంగా ఉందని దీన్ని తాకినా.. లేక ఈ మాంసాన్ని తిన్నా మనుషులకు ప్రమాదమే మరి.
చిన్న నోరు ఉండే ఈ చేపకు ఏమి దొరికినా గుటుక్కున మింగేస్తుంది. ఇంతకీ ఈ చేప ఇలా పెట్టెలా ఉండటానికి కారణం దాని శరీరంలోని ఎముకల నిర్మాణమే కారణం.
సాల్ట్‌వాటర్‌లోనే ఉండే ఈ చేపను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అయితే దాని ముట్టుకోవటం చేయకూడదు. కేవలం అందం కోసం ఆక్వేరియంలో పెంచుకోవచ్చు.
ఇవి నిదానంగా ఈదుతాయి. అందుకే చూడటానికి అందంగా కనపడతాయి.
డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రంలో ఉండే రాళ్లను పళ్లతో పట్టుకుని వేలాడుతుంటాయి.
ఇవి పదేళ్ల వరకూ జీవిస్తాయి.
మనదేశంలోని లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్, కేరళ తీర ప్రాంతాల్లో కూడా ఈ చేపలు నివసిస్తాయి.
మెర్సిడెస్ బెంజ్‌కార్ ఈ చేప స్ఫూర్తితో బయోనిక్ కార్‌ను తయారు చేయటం విశేషం.
కొన్ని చేపలకు కొమ్ములు కూడా ఉంటాయి.
వయసు పెరిగే కొలదీ వాటికి ఉండే పసుపుపచ్చ రంగు షేడ్ తగ్గుతుంది.