మీకు తెలుసా?
ABN , Publish Date - Jan 31 , 2024 | 11:21 PM
ఈ కోతి ముఖం చుట్టూ గుబురు గడ్డం ఉంటుంది.
ఈ కోతి ముఖం చుట్టూ గుబురు గడ్డం ఉంటుంది. పెద్దతోక ఉంటుంది. దీన్ని ‘లయన్ టైల్డ్ మకా’. సింహం తోకలా జుట్టు లేకుండా గట్టిగా తోక ఉంటుంది కాబట్టి ఈ పేరొచ్చింది. ఈ తోక పొడవు 25 సెం.మీ.
బియర్డ్ మంకీ అని కూడా పిలుస్తారు. తినే ఆహారాన్ని దవడల మధ్య దాచుకుంటుంది. అవసరమైనపుడు తింటుంది.
తలనుంచి తోక వరకు అరవై మూడు సెం.మీ ఉంటుంది. దీని బరువు పది కేజీల వరకు ఉంటుంది.
పుట్టిన రెండు నెలల తర్వాత ముఖం చుట్టూ జుట్టు పెరగటం ఆరంభమవుతుంది.
నల్లగా ఉండే కోతికి ముఖం చుట్టూ గ్రే జుట్టు వస్తుంది. గ్రే కలర్‌లో ఉండే కోతికి నల్ల జుట్టు ఉంటుంది.
చెట్ల కొమ్మల మీదనే నివసిస్తాయి. అక్కడే పడుకుంటాయి.
ఒక్కో గుంపులో ముప్ఫయ్ కోతులు ఉంటాయి. వీటిలో ఓ ఆల్ఫా మేల్ ఉంటుంది. అదే లీడర్‌గా పని చేస్తుంది. మగ కోతులు మాత్రం గ్రూపులు మారుస్తుంటాయి.
ఈ లయన్ టైల్డ్ కోతులు కేవలం మనదేశంలోనే ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో కనిపిస్తాయి.
ఇవి పదిహేడు రకాలుగా శబ్దాలు చేస్తాయి. వాటి కమ్యూనికేషన్‌ను ఇతర కోతులు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటాయి.
పూలు, ఆకులు, పండ్లు తిని బతుకుతాయి. అగ్రెసివ్‌గా ఉంటాయివి.
వీటి జీవనకాలం ఇరవయ్యేళ్లు.