Story : స్నేహితుల వేట
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:51 AM
ఒక అడవిలో సింహం పులి, కలిసిమెలిసి ఉండేవి. ఒక వేసవిలో వాటికి వారం రోజులపాటు ఆహారం దొరకలేదు. అవి రెండు ఆకలితో నకనకలాడిపోయాయి. ఆ సమయంలో వాటికి ఒక జింక కనిపించింది. అపుడు సింహం పులితో.. మిత్రమా మనిద్దరం ఎవరికి వారే వేటాడితే జంతువులు
ఒక అడవిలో సింహం పులి, కలిసిమెలిసి ఉండేవి. ఒక వేసవిలో వాటికి వారం రోజులపాటు ఆహారం దొరకలేదు. అవి రెండు ఆకలితో నకనకలాడిపోయాయి. ఆ సమయంలో వాటికి ఒక జింక కనిపించింది. అపుడు సింహం పులితో.. మిత్రమా మనిద్దరం ఎవరికి వారే వేటాడితే జంతువులు చిక్కకుండా పారిపోతున్నాయి. కాబట్టి ఈసారి ఇద్దరం కలిసి ఒకేసారి చెరువు వైపు నుంచి దాడి చేద్దాం అన్నది పులి. ఆ మాటలకు సరైన అంది రెండు కలిసికట్టుగా వేటాడటంతో జింక సులువుగా దొరికిపోయింది. కానీ సింహం కలిసి వేటాడాలి అన్న ఆలోచన వచ్చింది నాకే మొదట కాబట్టి ఈ జింకను నేను తింటాను అన్నది. జింక మీద వేగంగా మొదట దెబ్బ వేసింది నేను కాబట్టి జింకను నేనే తింటాను అన్నది పులి. ఈ రెండింటి గొడవను చెట్టు చాటు నుంచి ఒక నక్క చూస్తూ ఉంది అసలే ఆకలితో అలసిపోయి ఉండి బలహీనపడ్డ ఆ రెండు జంతువులు ఎక్కువసేపు కొట్లాడుకోలేవని అర్థమైన నక్క సింహం పులి కాసేపు గొడవపడి కూలబడగానే చాటుక్కున చెట్టు చాటు నుంచి వచ్చి జింకను లాక్కుని వెళ్లిపోయింది. అట్లా నక్క జింకను తీసుకుని వెళ్ళిపోగానే సింహం, పులి అనవసరంగా స్నేహితులమై ఉండి కూడా గొడవపడి చేతికి అందిన ఆహారాన్ని చేజార్చుకున్నామే అని బాధపడ్డాయి. ఇకమీదట కలిసికట్టుగానే పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాయవి.