Share News

Moral story : కృతజ్ఞత నేర్పిన దొంగ

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:15 AM

ఒక ఊరిలో సీతారామయ్యఅనే రైతు వద్దఒక గుర్రం ఉండేది. దానికి అక్కడ ఉండటం అసలునచ్చేది కాదు. ‘నా పూర్వీకులంతా రాజుల కొలువుల్లో ఉండి మంచి సౌకర్యాలు అనుభవించారు. నేను ఇక్కడ బానిస బతుకు

Moral story : కృతజ్ఞత నేర్పిన దొంగ

ఒక ఊరిలో సీతారామయ్యఅనే రైతు వద్దఒక గుర్రం ఉండేది. దానికి అక్కడ ఉండటం అసలునచ్చేది కాదు. ‘నా పూర్వీకులంతా రాజుల కొలువుల్లో ఉండి మంచి సౌకర్యాలు అనుభవించారు. నేను ఇక్కడ బానిస బతుకు మతుకుతున్నాను’అని ప్రతిరోజూ బాధ పడుతూ ఉండేది. వీలైనంత త్వరగా అక్కడినుండి తప్పించుకు పోవాలని అనుకుంటూ ఉండేది. ఒక రోజు రాత్రి, సీతారామయ్య ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు అతను చేతికిఅందిన సొమ్ము, విలువైన వస్తువులు మూటగట్టుకుని పోతూ ఉంటే, గుర్రం గమనించిమౌనంగా ఉన్నది తీరాదొంగ వెళ్లిపోతుంటే, గుర్రం అతనితో దయచేసి, నా కట్లు విప్పి, నన్ను విడిపించుఅని అడిగింది.‘ నీ కట్లు విప్పితే నాకేం లాభం?అన్నాడు దొంగ .దానికి‘‘కట్లు విప్పి, నన్ను కూడా నీతో తీసుకెళితే, నీకు సేవ చేస్తూ, నీ దగ్గరే పడిఉంటాను’ అన్నది గుర్రం. ఆ మాటలు విన్న దొంగ ‘నేను దొంగతనం చేస్తున్నాను అని నీకు తెలుసు, ఐనా నువ్వు నీ యజమానిని నిద్ర లేపడానికి, నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు. చిన్న శబ్దమైనా చేయలేదు. ఇప్పటి యజమానిపట్ల ఇలా ఉన్న దానివి రేపు నాకు ఆపద కలిగినా ఇలాగే చేస్తావు కాబట్టి, నిన్ను నేను విడిపించను, నీకు కృతజ్ఞత లేదు’ అని చెప్పి, ఆ దొంగ వెళ్లిపోయాడు. ఆ మాటలకు సిగ్గుపడిన గుర్రం ఆ రోజనుండి తన యజమాని చెప్పిన పని చేస్తూ, కృతజ్ఞతతో మెలగసాగింది.

Updated Date - Aug 01 , 2024 | 12:15 AM