Share News

Story : అడగకూడని వరాలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:51 AM

ఒక ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేవారు. వారిద్దరికీ అమితమైన కోరికలు, ఆశలు ఉండేవి. ‘‘దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తే బావుండును’’ అనుకొనేవారు. వారికి ఒకే సంతానం. భర్త అప్పుడప్పుడు సరదాగా- ‘‘మన పిల్లవాడికి మీసాలు వచ్చిన తర్వాత

Story : అడగకూడని వరాలు

ఒక ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేవారు. వారిద్దరికీ అమితమైన కోరికలు, ఆశలు ఉండేవి. ‘‘దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తే బావుండును’’ అనుకొనేవారు. వారికి ఒకే సంతానం. భర్త అప్పుడప్పుడు సరదాగా- ‘‘మన పిల్లవాడికి మీసాలు వచ్చిన తర్వాత విశ్రాంతి దొరుకుతుంది’’ అనేవాడు. ఒక రోజు వారింటికి ఒక బాటసారి వచ్చి ఆశ్రయం కోరాడు. అతనికి దంపతులు అతిధ్యమిచ్చారు. మాటల్లో తమ కోరికల గురించి చెప్పారు. అప్పుడు ఆ బాటసారి- ‘‘నేను మీకు మూడు వరాలు ఇస్తాను.. కోరుకోండి’’ అన్నాడు. అప్పుడు భర్త - ‘‘మా పిల్లవాడికి మీసాలు వస్తే నేను విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నా’’ అన్నాడు. భార్య - ‘‘నేను ఏ వస్తువు తాకినా అది బారెడు బంగారం కడ్డిలా మారిపోవాలి’’ అని కోరుకుంది. బాటసారి ‘తథాస్తు’ అన్నాడు. వెంటనే ఉయ్యాలలో ఉన్న పిల్లవాడికి మీసాలు మొలిచాయి. భార్య పొరపాటున ముక్కును తుడుచుకోవటంతో- ముక్కు మూరెడు బంగారంగా మారిపోయింది. ఆ భార్యభర్తలిద్దరికీ ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆ బాటసారి- ‘‘మీకు ఇంకో వరం ఉంది.. కోరుకోండి’’ అన్నాడు. అప్పుడు వారిద్దరు - ‘‘మాకు ముందు ఇచ్చిన వరాలు వద్దు.. మామూలుగా మార్చండి’’ అని కోరుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఎప్పుడూ వారు అత్యాశకు పోలేదు.

నీతి: అత్యాశ లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది.

Updated Date - Jun 12 , 2024 | 03:52 AM