Share News

సింహం- చిట్టెలుక

ABN , Publish Date - Feb 05 , 2024 | 11:27 PM

అడవిలో మృగరాజు సింహం. రాజు వస్తున్నాడంటే హడలు. అయితే అదే అడవిలో ఓ చిట్టెలుక ఉండేది.

సింహం- చిట్టెలుక

అడవిలో మృగరాజు సింహం. రాజు వస్తున్నాడంటే హడలు. అయితే అదే అడవిలో ఓ చిట్టెలుక ఉండేది. ఆ చిట్టెలుక సోమరి. ఎంత సోమరి అంటే శత్రువు వచ్చినా పరిగెత్తకుండా సోమరిగా ఉండేంత సోమరి. ప్రాణాలు పోతాయని మిత్రులు హెచ్చరించినా పట్టించుకునేది కాదు. దాని తీరే అంత.

ఒకరోజు సింహం దారింటా వెళ్తోంది. దానికి నిద్ర వస్తోంది. పడుకుందామని పొదలచాటుకు వెళ్లింది. ఆ పొదల చాటునే అనుకోకుండా చిట్టెలుక ఇల్లు ఉంది. ఆ సింహం పడుకుంది. నిద్రలో ఉంది. చిట్టెలుక బొరియలోంచి బయటకు రావాలి ఆహారం కోసం. సింహం ఉందని పట్టించుకోకుండా సింహాన్ని ఎక్కి తన పనికి వెళ్లిపోయింది. మళ్లీ అరగంట తర్వాత బొరియ దగ్గరకు వచ్చింది. సింహం మీద తిరుగుతూ ఉంది. మృగరాజు ఆ సింహమే అని దానికి తెలీదు. మిగతా జంతువులు దాని దరిదాపుల్లో లేవు. సింహం చిట్టెలుక చేష్టలకు చూసింది. పంజా దగ్గరకు వస్తూనే చిట్టెలుకను పట్టేసుకుంది సింహం. చిట్టెలుక ప్రాణం పోయినట్లు విలవిల్లాడింది. మృగరాజునే అవమాన పరుస్తావా? అన్నట్లు చూసింది సింహం. వదిలేయండి రాజా.. మీరనుకోలేదు. మీకు తప్పకుండా ఏదో సాయం చేస్తాను అన్నది చిట్టెలుక.

సింహానికి కోపం వచ్చింది. ‘అసలే తప్పు చేశావు. పైగా నాకు సాయం చేస్తానని నోటికి మాట్లాడుతున్నావు’ అంటూ చేతిని అదిమిపట్టింది. చిట్టెలుక కళ్లు బయటకి వచ్చాయి. క్షణాల్లో ఓ చిలుక వచ్చి.. ‘చిట్టెలుక మీదనా మీ ప్రతాపం’ అన్నది. వెంటనే చిట్టెలుకను సింహం వదిలేసింది. భయంతో వణికిపోయింది. బొరియలోపలికి పారిపోయింది.

ఒక రోజు చిట్టెలుక బొరియలో ఉన్నది. ఓ సింహం అరుపు వినపడింది. బయటకు వచ్చి చెట్టెక్కి చూసింది. సింహం వలలో ఇరుక్కుపోయింది. వేటగాడి వలకు చిక్కిన సింహం దగ్గరకు వెళ్లింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వలను తన పొడవైన పళ్లతో కొరికేసింది. ఆ చిట్టెలుక మంచితనంతో పాటు ఇచ్చిన మాట నెరవేర్చుకునే తత్వానికి పొంగిపోయింది సింహం. ఎంత గొప్ప మనసో అంటూ చిట్టెలుకను కీర్తించింది. ‘ఇది సాయమే కదా’ అన్నది చిట్టెలుక.

Updated Date - Feb 05 , 2024 | 11:27 PM