Navya : బ్యూటిఫుల్ లుక్ కోసం...
ABN , Publish Date - Jul 27 , 2024 | 05:37 AM
ముఖం కాంతులీనుతూ, శరీరం కళావిహీనంగా కనిపిస్తే ఏం బాగుంటుంది? ముఖంతో పాటు, మెడ, చేతులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం బాడీ మేకప్ ఎంచుకోవాలి.
ముఖం కాంతులీనుతూ, శరీరం కళావిహీనంగా కనిపిస్తే ఏం బాగుంటుంది? ముఖంతో పాటు, మెడ, చేతులు ఆకర్షణీయంగా కనిపించడం కోసం బాడీ మేకప్ ఎంచుకోవాలి.
చర్మం నునుపుగా మెరుపులీనుతూ కనిపించేలా చేసే ఈ బాడీ మేకప్ పూర్తిగా శరీరానికే పరిమితం.
రెండింటికీ తేడా: ముఖానికి వేసుకునే మేకప్ పలుచగా, ఎక్కువ మెరుపును కలిగి ఉంటుంది. బాడీ మేకప్ మందంగా ఉండడంతో పాటు, పిగ్మెంట్ను కూడా కలిగి ఉంటుంది.
దుస్తులకు అంటుకోదు: ముఖానికి మేకప్ వేసుకుంటే పొరపాటున చెరిగిపోతుందేమోనని కంగారు పడుతూ ఉంటాం. కానీ బాడీ మేకప్ అలా కాదు. ఇది దుస్తులకు అంటుకోదు. అయితే ఎక్కువగా చమట పట్టే తత్వం ఉన్నవాళ్లు మేకప్ చెరిగినా దుస్తులకు అంటుకున్నట్టు కనిపించకుండా ఉండడం కోసం లేత రంగు దుస్తులను ధరించడం మేలు.
ఇలా ఎంచుకోవాలి
ఫేసియల్ మేకప్ ఐటమ్స్‌ను ఎంచుకునేటప్పుడు అనుసరించే నియమాలనే బాడీ మేకప్ ఎంచుకునేటప్పుడు కూడా అనుసరించాలి. బాడీ మేక్‌పలో భాగంగా ఎంచుకునే ఫౌండేషన్లు, కన్సీలర్లూ నాణ్యమైనవే అయి ఉండాలి.
చర్మపు రంగుకు దగ్గరగా ఉండే బాడీ మేకప్ ఎంచుకోవాలి. లేత గులాబీ రంగు చర్మం కలిగినవాళ్లు, బీజ్, క్రీమ్ షేడ్స్ ఎంచుకోవాలి. ఐవరీ, బఫ్, ట్యాన్ బాడీ షేడ్స్ కూడా బాగుంటాయి.బాడీ బ్రాంజర్లు, బాడీ హైలైటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చర్మపు రంగుకు దగ్గరగా ఉండేవాటినే ఎంచుకోవాలి.
ఆయిల్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్... ఈ రెండు పేర్లు ఉన్న వాటినే ఎంచుకోవాలి.
మేక్‌పకు ముందు
చర్మానికి నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
పగుళ్లు, గాయాలు లాంటివి లేకుండా చూసుకోవాలి.
మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి.
బాడీ స్క్రబ్బింగ్ లేదా బాడీ పాలిషింగ్‌తో చర్మం మరింత మెరుస్తుంది.
వ్యాక్సింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి.