Navya : స్పార్క్ సూపర్‌గా...
ABN , Publish Date - Aug 19 , 2024 | 01:35 AM
వర్కింగ్ కపుల్‌కు వారాంతాల్లో మాత్రమే తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి.
వర్కింగ్ కపుల్‌కు వారాంతాల్లో మాత్రమే తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి. మునుపటి ఆకర్షణ తగ్గిందనిపిస్తే, చిన్న చిన్న చిట్కాలతో కోల్పోయిన స్పార్క్‌ను తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించాలి.
ఇండోర్ గేమ్స్:
ఆఫీసు పని, ఇంటి పనితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరూ కలిసి క్యారమ్స్, ప్లేయింగ్ కార్డ్స్, లూడో, చెస్ మొదలైన ఇండోర్ గేమ్స్ ఆడాలి. ఆటలతో ఒత్తిడి తొలగడంతో పాటు, కాలక్షేపం కూడా దక్కుతుంది. కలిసి నాణ్యమైన సమయం గడిపామనే సంతృప్తి కూడా దక్కుతుంది.
పాత జ్ఞాపకాలు:
పెళ్లి నాటి ఫొటో ఆల్బమ్‌ను తిరగేస్తే పాత జ్ఞాపకాలతో మానసికోల్లాసం దక్కుతుంది. ఒకప్పటి గుర్తులు, సంఘటనలు కళ్ల ముందు మెదిలి, దంపతుల మధ్య దూరాలు తరుగుతాయి.
సరదా సరదాగా:
సరదా టెక్స్ట్ మెసేజీలు పంపుకుంటూ, ఒకర్నొకరు టీజ్ చేసుకుంటూ ఉండాలి. సరికొత్త వంటకాలతో భార్య భర్తనూ, ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించిన సర్ప్రైజ్ గిఫ్ట్స్‌తో భర్త భార్యనూ సర్ప్రైజ్ చేసుకోవచ్చు.
పనుల్లో భాగస్వామ్యం:
ఇంటి పనులు కలిసి చేయడం ద్వారా కూడా దంపతులు తమ మధ్య తగ్గే అన్యోన్యతను పెంచుకోవచ్చు. కూరగాయలు తరగడం, మిక్సీ, వాషింగ్ మెషిన్, గార్డెనింగ్ పనులతో భర్తలు భార్యలకు సహాయపడవచ్చు. అలాగే భార్యలు కూడా భర్తల పనుల్లో పాలుపంచుకోవచ్చు.