Share News

Navya : ఐసీ 814 హైజాక్‌ సంఘటనతో...

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:42 AM

1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఐసీ 814 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్‌ ‘ఐసి 814 :

Navya : ఐసీ 814 హైజాక్‌ సంఘటనతో...

Navya : 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఐసీ 814 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్‌ ‘ఐసి 814 : ది కాందహార్‌ హైజాక్‌’.

దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనలో 188 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది వారం రోజుల పాటు కాందహార్‌లో తాలిబన్ల చేతుల్లో బందీలుగా ఉన్నారు.

హైజాక్‌ అయిన విమానాన్ని నియంత్రణలోకి తీసుకోవడానికి ఇండియన్‌ ఆర్మీ చేసిన ప్రయత్నాలు,ఢిల్లీలోని వార్‌రూమ్‌లో రూపొందిన వ్యూహాలు ప్రయాణికులను భద్రంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల నేపథ్యాన్ని ఈ సిరీస్‌ కళ్లకు కడుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

విజయ్‌ వర్మ, అరవింద్‌ స్వామి, నసీరుద్దీన్‌ షా, దియా మీర్జా కీలకపాత్రలు పోషించారు. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ఆగస్టు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది.

Updated Date - Aug 25 , 2024 | 12:42 AM