Share News

Pastry Dishes : పండుగల్లో పసందుగా

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:28 AM

పండగ సీజన్‌ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్‌ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..

Pastry Dishes : పండుగల్లో పసందుగా

వంటిల్లు

పండగ సీజన్‌ వచ్చేస్తోంది. పండగ కన్నా ముందే కొన్ని పిండి వంటలు ట్రై చేస్తే బావుంటుంది కదా! అందుకే కొన్ని స్పెషల్‌ పిండి వంటలు ఇస్తున్నాం.. ఆస్వాదించండి..

జిటాయ్‌ ఫిర్‌దౌస్‌ (గుమ్మడి పరమాన్నం)

  • కావాల్సిన పదార్థాలు

బాగా పండిన గుమ్మడికాయ (చిన్న ముక్కలు చేసుకోవాలి), వెన్న తీయని పాలు- 2 లీటర్లు, పంచదార- 200 గ్రాములు, ఏలకుల పొడి- ఒక స్పూను, సగం పైనాపిల్‌ ( చిన్న ముక్కలు చేసుకోవాలి)

  • తయారీ విధానం

పాలలో గుమ్మడి ముక్కలను వేసి ఉడకపెట్టాలి. కొద్ది సేపటి తర్వాత ముగ్గిన ముక్కలను గుజ్జుగా చేయాలి. రెండు లీటర్ల పాలు బాగా చిక్కపడిన తర్వాత పంచదార వేయాలి. పంచదార వేసిన తర్వాత 10 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి కిందకు దింపి పైనాపిల్‌ ముక్కలు, ఏలకుల పొడి కలపాలి.

  • జాగ్రత్తలు

  1. బాగా పండిన గుమ్మిడికాయ తియ్యగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పంచదార వేయాల్సి అవసరం లేదు.

  2. పంచదార బదులుగా బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు

  3. పైనాపిల్‌ ముక్కలను వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు.


అనోఖి ఖీర్‌

  • కావాల్సిన పదార్థాలు

తెల్ల ఉల్లిపాయలు- వంద గ్రాములు, పంచదార- వంద గ్రాములు, పాలు- రెండు లీటర్లు, ఏలకుల పొడి- ఒక స్పూను, డ్రైఫ్రూట్స్‌- తగినన్ని

Untitled-2 copy.jpg

  • తయారీ విధానం

తెల్ల ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని నీళ్లలో బాగా కడగాలి. ఆ తర్వాత ఒక మూకుడులో నీళ్లు పోసి వాటిలో ఉల్లిపాయలను ఉడికించాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత స్టౌ మీద నుంచి దింపాలి. నీళ్లను పారబోసి ఉడికిన ఉల్లిపాయల ముక్కలను చల్లబర్చాలి.

పాలను బాగా మరగనివ్వాలి. వాటిలో చల్లారిన ఉల్లిపాయల ముక్కలు వేయాలి. ఈ మిశ్రమం దగ్గరపడిన తర్వాత పంచదార, ఏలకుల పొడి వేయాలి.

చల్లారిన తర్వాత సర్వ్‌ చేసేముందు డ్రై ఫ్రూట్స్‌ వేయాలి.

  • జాగ్రత్తలు

  1. కేవలం తెల్ల ఉల్లిపాయలను మాత్రమే వాడాలి. మామూలు ఉల్లిపాయలను వాడకూడదు.

  2. వాసన పోయేదాకా ఉల్లిపాయలను ఉడికించాలి.


కుబానీ ట్రిఫిల్‌

  • కావాల్సిన పదార్థాలు

ఒక స్పాంజ్‌ కేకు, యాప్రికాట్‌- 200 గ్రాములు, పాలు- ఒక లీటరు, కస్టర్డ్‌ పౌడర్‌- నాలుగు టీ స్పూనులు, పంచదార- 200 గ్రాములు, పళ్ల ముక్కలు- ఒక కప్పుడు, ఫాంటా- 200 ఎంఎల్‌ బాటిల్‌, జామ్‌- తగినంత, ఫ్రెష్‌ క్రీమ్‌- ఒక కప్పుడు, డ్రై ఫ్రూట్స్‌- తగినన్ని

Untitled-2 copy.jpg

  • తయారీ విధానం

  1. కస్టర్డ్‌: ఒక గ్లాసులో కొద్దిగా పాలను తీసుకొని కస్టర్డ్‌ పౌడర్‌ను కలపాలి. మిగిలిన పాలను బాగా మరగనివ్వాలి. దానిలో పంచదార, కస్టర్డ్‌ పాల మిశ్రమాన్ని వేసి చిక్కపడేదాకా ఉడికించాలి. ఆ తర్వాత స్టౌ మీద నుంచి కిందకు దింపి చల్లబరచాలి.

  2. యాప్రికాట్‌ ప్యూరీ: యాప్రికాట్‌లు నీళ్లలో 24 గంటలు నానబెట్టాలి. వాటిలో నుంచి గింజలు తీసేయాలి. ఆ తర్వాత యాప్రికాట్‌లను చిన్న చిన్నముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి.. వంద గ్రాముల పంచదార వేయాలి. ఉడుకుతున్న పంచదార నీళ్లలో యాప్రికాట్‌ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత స్టౌవ్‌ మీద నుంచి దింపి చల్లబరచాలి.

  3. ట్రిఫిల్‌ తయారీ: కేకును రెండు ముక్కలుగా చేయాలి. ఈ రెండు ముక్కలకు జామ్‌ను రాయాలి. ఆ తర్వాత కేకును చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత ముక్కల్లో ఫ్యాంటా పోయాలి. ఆ ముక్కలపై పళ్లముక్కలు పరచాలి. దానిపైన యాప్రికాట్‌ ప్యూరీని సరిసమానంగా ఉండేలా రాయాలి. ఆ పైన కస్టర్డ్‌ను కూడా వేయాలి. ఆ తర్వాత పైభాగంలో క్రీమ్‌, డ్రైఫ్రూట్స్‌ను కూడా వేయాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచి తింటే బావుంటుంది.

  • జాగ్రత్తలు

  1. కస్టర్డ్‌ను కొద్దిగా చిక్కగా చేయాలి.

  2. ఫ్యాంటా బదులుగా తియ్యటి నారింజరసాన్ని కూడా వాడవచ్చు

  3. ఫస్పాంజ్‌ కేకు తాజాగా ఉంటే రుచి బావుంటుంది.

Updated Date - Sep 28 , 2024 | 01:28 AM