Share News

Sara Ali Khan : మా కుటుంబానికి ఆ సినిమా టైటిల్‌ సరిపోతుంది

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:01 AM

సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు బాలీవుడ్‌ నటి సారాఅలీ ఖాన్‌. ఇటీవలే ఆమె ‘మర్డర్‌ ముబారక్‌’, ‘యే వతన్‌ మేరే వతన్‌’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Sara Ali Khan : మా కుటుంబానికి ఆ సినిమా టైటిల్‌ సరిపోతుంది

సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు బాలీవుడ్‌ నటి సారాఅలీ ఖాన్‌. ఇటీవలే ఆమె ‘మర్డర్‌ ముబారక్‌’, ‘యే వతన్‌ మేరే వతన్‌’ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ఈ బ్యూటీ.. సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

‘‘వరుసగా సవాల్‌ విసిరే పాత్రల్లో నటించడం ఎంతో కొత్త అనుభూతినిస్తుంది. ఒకేసారి రెండు విభిన్న కథలు.. నేపథ్యాలున్న సినిమాల్లో నటిస్తే.. రెండు వేర్వేరు ప్రపంచాల్లో పయనించినట్లు అనిపిస్తుంది. ‘మర్డర్‌ ముబారక్‌’, ‘యే వతన్‌ మేరే వతన్‌’ సినిమాల్లో ఒకేసారి నటించడం ద్వారా నాకు ఈ అనుభవం సొంతమైంది. మాది చాలా పెద్ద కుటుంబం. నానమ్మ షర్మిలా ఠాగూర్‌, నాన్న సైఫ్‌ అలీఖాన్‌, అత్త సోహా అలీఖాన్‌ను ఎప్పుడు కలసినా మా మధ్య ఉండే కామన్‌ టాపిక్‌ సినిమా. మా ఫ్యామిలీకి ఒక సినిమా టైటిల్‌ను సూచించవలసి వస్తే.. అది సూపర్‌ హిట్‌ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ అతికినట్లు సరిపోతుంది’’ అని చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 12:08 AM