Technology : స్క్రీన్ షాట్ ప్రివ్యూ రీడిజైన్
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:29 AM
ఆండ్రాయిడ్ 15 బేటా 3లో స్ర్కీన్‌షాట్ ప్రెవ్యూని రీడిజైన్ చేశారు. పిక్సెల్‌కు చెందిన జనరేటివ్ ఏఐ స్టిక్కర్లపై పని జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
ఆండ్రాయిడ్ 15 బేటా 3లో స్ర్కీన్‌షాట్ ప్రెవ్యూని రీడిజైన్ చేశారు. పిక్సెల్‌కు చెందిన జనరేటివ్ ఏఐ స్టిక్కర్లపై పని జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ‘ఏపీకే ఇన్‌సైట్’ పోస్టును డి కంపైల్ చేసినప్పుడు వివిధ కోడ్స్ కనిపించాయి. అది సరికొత్త ఫీచర్ రాబోతోందని తెలుపుతోంది. కొత్త పిల్ షేప్ కంటైనర్ అదీ సర్క్యులర్ షేర్, మేకప్ బటన్స్‌తో ఉంది. ఇది సైడ్ బై సైడ్ అప్రోచ్‌కు బదులుగా ఉండనుంది. ఇది తుది డిజైన్ కావచ్చు. బగ్ కూడా కావచ్చు. ఏదన్నది స్పష్టం కాలేదు.
మొత్తానికి ప్రత్యేకించి పిక్సెల్ డివైజ్‌ల కోసం ఇది క్రియేటివ్ అసిస్టెంట్ యాప్/ సర్వీసెస్‌ను రూపొందించనుంది. స్ర్కీన్‌షాట్ ఎడిటింగ్ టూల్‌తో ఇంటిగ్రేట్ చేయడంతో రీమిక్స్‌డ్ స్టిక్కర్లు, ఇమేజ్‌లు జనరేట్ అవుతాయి. అప్పుడు మార్పు లేనట్టే. స్ర్కీన్‌షాట్ ప్రెవ్యూకు తోడు సిస్టమ్ షేర్ షీట్, గూగుల్ ఫొటోస్, ఫైల్స్ యాప్‌లో ఇంటిగ్రేట్ అయింది. ఎఐకోర్ పర్మిషన్‌ను క్రియేటివ్ అసిస్టెంట్ తీసుకుంటుంది. ఆన్-డివైజ్ మోడల్‌ని ఉపయోగించి స్టిక్కర్లు జనరేట్ చేయవచ్చు. మొత్తానికి ఫన్‌కు అవకాశం కలుగుతుంది.