Share News

Experts : పండుగ రోజూ నిద్రపోవాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:15 AM

పండుగలు వచ్చాయంటే బంధువులు, స్నేహితులు వస్తారు. సరదాగా బయటకు వెళ్తారు. వీటన్నింటి వల్ల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి.

Experts : పండుగ రోజూ నిద్రపోవాలి

పండుగలు వచ్చాయంటే బంధువులు, స్నేహితులు వస్తారు. సరదాగా బయటకు వెళ్తారు. వీటన్నింటి వల్ల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. నిద్ర వేళలు అటూ ఇటూ అవుతాయి. దీని ప్రభావం పండుగ తర్వాత కూడా ఉంటుంది. ముఖ్యంగా నిద్ర లేకపోవటం వల్ల చిరాకుగా కూడా ఉంటుంది. అందువల్ల పండుగ సమయంలో నిద్రను నియంత్రించటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

  • రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం. పండగలలో ఈ నిద్ర గంటలు గణనీయంగా తగ్గిపోతాయి. అందువల్ల వీలైనంత వరకు ఈ నిద్ర గంటలు తగ్గకుండా చూసుకోవాలి. దీని వల్ల పండుగ మర్నాడు ఫ్రెష్‌గా ఉండగలుగుతారు.

  • వీలైనంత వరకు విందు భోజనాలను మధ్యాహ్నమే చేస్తే మంచిది. రాత్రి పూట చేస్తే సరిగ్గా నిద్ర పట్టదు. అంతే కాకుండా పండగ రోజుల్లో పనుల్లో పడిపోయి తక్కువ నీళ్లు తాగుతారు. అలా కాకుండా పండగ రోజుల్లో కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగటాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

  • బంధుమిత్రులను కలిసిన ఉత్సాహం వల్ల ఎక్కువ ఉత్సుకతకు లోనవుతూ ఉంటారు. దీని వల్ల ఆలోచనలపై నియంత్రణ ఉండదు. పండగ రోజుల్లో నిద్ర పట్టకపోవటానికి ఇది కూడా ఒక కారణం. అందువల్ల పడుకొన్నే ముందు కొంత సేపు ధ్యానం వంటివి చేస్తే త్వరగా నిద్ర పడుతుంది.

  • కొందరు మధ్యాహ్నం సమయం చిక్కినప్పుడు నిద్రపోతారు. దీని వల్ల రాత్రి నిద్ర వేళల్లో మార్పు వస్తుంది. అందువల్ల మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే మంచిది.

Updated Date - Oct 27 , 2024 | 05:15 AM