Share News

కమల్‌ లుక్‌ చూసి ఆశ్చర్యపోయా - ఎస్‌.ఎస్‌.రాజమౌళి

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:31 AM

దర్శకధీరుడు రాజమౌళి ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించి.. చిత్ర బృందానికి, అభిమానులకు ఎక్కడలేని జోష్‌ ఇచ్చారు.

కమల్‌ లుక్‌ చూసి ఆశ్చర్యపోయా - ఎస్‌.ఎస్‌.రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమా ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించి.. చిత్ర బృందానికి, అభిమానులకు ఎక్కడలేని జోష్‌ ఇచ్చారు. ‘‘ట్రైలర్‌ చూశాను. అద్భుతంగా ఉంది. విజువల్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ నాకు విపరీతంగా నచ్చేశాయి. సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడటానికి కావాల్సిన ఆసక్తి, ఉత్సాహాం వచ్చింది. సినిమాలో ప్రధాన పాత్రధారులైన ప్రభాస్‌, అమితాబ్‌, దీపిక పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.

ఇక, కమల్‌ హాసన్‌ లుక్‌ చూసి ఆశ్చర్యపోయా. చాలాసేపటి వరకూ ఆయన లుక్‌ ఇచ్చిన ట్రాన్స్‌లోనే ఉండిపోయా. అందరిలాగే, డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ చూపించే కొత్త ప్రపంచాన్ని థియేటర్లలో చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రభాస్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించగా, అశ్వనీ దత్‌ నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, పశుపతి, స్వాస్థ చటర్జీ, దీపికా పదుకొనే, దిశా పటానీ, మాళవిక నాయర్‌, శోభన, అన్నా బెన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న సినిమాను ఐదు భారతీయ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భాషల్లో విడుదల చేయనున్నారు.

Updated Date - Jun 23 , 2024 | 12:31 AM