Makhandi Halwa: ఈ మఖండి హల్వా ఎలా చేయాలంటే..
ABN , Publish Date - Jan 30 , 2024 | 02:51 PM
పాకిస్తాన్‌లోని పెషావర్ ప్రాంతం నుంచి ప్రత్యేకమైన డిజర్ట్ తయారీ ఇది. ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
నానబెట్టిన సమోలినా నూకతో తయారుచేస్తారు. పాకిస్తాన్‌లోని పెషావర్ ప్రాంతం నుంచి ప్రత్యేకమైన డిజర్ట్ తయారీ ఇది. ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు..
ఒక కప్పు నెయ్యి, అర కప్పు పంచదార, అవసరమైనంత నీరు, అర టీ స్పూన్ యాలకుల పొడి, రెండు టీస్పూన్ల తరిగిన బాదం, రెండు టీ స్పూన్ల పిస్తా, రెండు కప్పుల నానబెట్టిన కరాచీ నూకలానే ఉండే సెమోలినా నూకను వాడతారు..
1. ఈ నూకను అరగంటపాటు నాననివ్వాలి.
2. కడాయిలో నెయ్యి వేసి పంచదార పోసి చక్కెరను పాకం అయ్యే వరకూ మరిగించి, దింపుకోవాలి.
ఇది కూడా చదవండి: ట్యాబ్లెట్స్ వేసుకునేప్పుడు ఎంత నీటిని తాగుతున్నారు?
3. నీరు, యాలకుల పొడి తరిగిన పిస్తా బాదం పలుకులు వేసి బాగా కలపాలి. మంటను తగ్గించి ఉంచాలి.
4. కడాయిలో నానబెట్టిన నూకను వేసి మిక్స్ చేసి నెయ్యి అంతా పీల్చుకని, హల్వా పాన్‌కు అంటకుండా వచ్చే వరకూ కలుపుతూ ఉండాలి.
5. ఇది తయారై దగ్గరపడింది అనుకోగానే దింపేసి సర్వ్ చేసుకోవడమే.. కమ్మని రుచితో ఈ హల్వా అందరికీ నచ్చుతుంది.
ఈ మఖండి హల్వాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలోనూ, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియలోనూ మద్దతుగా నిలుస్తాయి.
ఇక నెయ్యి కలపడం వల్ల జీర్ణ క్రియకు కూడా మంచి సపోర్ట్ అవుతుంది. ఇందులోని అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.