Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!
ABN , Publish Date - Aug 14 , 2024 | 11:44 AM
ప్రతి రోజూ కనీసం తులసికి 6 నుంచి 8 గంట సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఉత్తరం వైపు ఉంచాలి. ఈ మొక్క చల్లదనాన్ని మరీ తట్టుకోలేదు. దీనిని మంచు, గట్టిగా వీచే గాలుల నుంచి రక్షించాలి. వాటర్ డ్రైనేజ్ అయ్యే విధంగా కుండీ ఉండేటట్టు చూడాలి.
తులసి ఈ మొక్కను టెనుఫ్లోరమ్ అని పిలుస్తారు. దీనినే పుదీనా కుటుంబానికి చెందిన హౌలీ బాసిల్ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి పూజలందుకుంటున్న మొక్క తులసి. హిందూ మతంలో తులసి ఎంత కీలకమైనదంటే ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క తప్పక ఉంటుంది. తులసి రసాన్ని సాధారణంగా చర్మ వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. తులసిని పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, మూలికా వైద్యంలో ఉపయోగిస్తారు. ఇన్ని ప్రయోజనాలున్న తులసి మొక్క ప్రత్యేకంగా ఈ వానాకాలంలో ఎలా నాటాలి. చూద్దాం
వానాకాలం తులసి పోషణ ఎలా..
వానాకాలం తులసి పెంచాలంటే ముందుగా విత్తనాలను సేకరించాలి. ఇలా సేకరించిన విత్తనాలు కాస్త ఎండ పొడలో ఆరనివ్వాలి. తులసి మొక్క నాటేందుకు 8 అంగుళాల పొడవున్న కుండ కావాలి. తులసి విత్తనాలు చిన్నగా ఉంటాయి కనుక మట్టిలో లోతుగా పాతనవసరం లేదు. రెండు మీటర్ల పొరలో విత్తనాలు నాటుకోవడమే. విత్తనాలు నాటిన తర్వాత సూర్యకాంతి పడే చోట ఉంచాలి. మరీ తేమగా కాకుండా, మరీ ఎండ పొడ లేని చల్లని ప్రదేశాల్లో మొక్కలు నాటాలి.
Shiny Hair : లావెండర్ ఆయిల్ నుండి అర్గాన్ ఆయిల్ వరకు మెరిసే జుట్టు కోసం ఏది బెస్ట్..
కొత్తగా పెరుగుతున్న తులసి మొక్కలకు రోజులో ఒకసారి మాత్రమే నీరు ఇస్తూ ఉండాలి. కొత్త మొక్క త్వరగా పెరగడానికి మొక్కను కత్తిరిస్తూ ఉండాలి. మొక్క పచ్చగా ఆకులతో గుబురుగా ఉండేందుకు తులసిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. గాలి తగులుతూ ఉండే విధంగా సహకరించాలి.
మీలీ బగ్స్, అఫిడ్స్, స్పైడర్ మైట్, వైట్ ఫ్లెస్‌తో సహా అనేక సాధారణ తెగుళ్ళకు గురి కావచ్చు. తెగుళ్ళ చికిత్స కోసం, వేప పురుగుమందు లేదా క్రిమి సంహారక సబ్బును ఉపయోగించాలి. సాధారణ పవిత్రత కలిగి తులసిలో అనేక ప్రసిద్ధ జాతులున్నాయి.
రామ్ తులసి.. పెద్ద ఆకులు, సువాసన, చాలా చికిత్స.
కర్పూర్ తులసి.. మొక్క కర్పూరం వాసనతో ఉంటుంది.
Health Tips : శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !!
నిమ్మ తులసి, బలమైన సుగంధ, నిమ్మ వాసన కలిగిన మొక్క, పంటకు అవసరం.
మొక్కల రాజు, స్వీట్ బాలిల్ కూడా తులసికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.
ప్రతి రోజూ కనీసం తులసికి 6 నుంచి 8 గంట సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఉత్తరం వైపు ఉంచాలి. ఈ మొక్క చల్లదనాన్ని మరీ తట్టుకోలేదు. దీనిని మంచు, గట్టిగా వీచే గాలుల నుంచి రక్షించాలి. వాటర్ డ్రైనేజ్ అయ్యే విధంగా కుండీ ఉండేటట్టు చూడాలి. మట్టి, సిమెంట్ కుండీలను ఎంచుకోవాలి. మరీ ఎక్కువ నీటిని మొక్కకు వదలకూడదు. రెగ్యులర్ గా మొక్కను కత్తిరిస్తూ ఉండాలి. వానాకాలంలో ప్రత్యేకించి ఈ శ్రద్ధలు తీసుకుంటే తులసి మొక్క బాగా పెరుగుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.