Health Tips : శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !!
ABN , Publish Date - Aug 10 , 2024 | 03:05 PM
సాల్మన్, ట్యూనా, సార్టినెస్ వంటి జిడ్డు చేపల ద్వారా పొందవచ్చు. చియా, అవిసె గింజలు, వాల్ నట్స్ లోనూ ఒమేగా 3 ఉంటుంది. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలో రకరకాల విధులకు అవసరం. ఇవి మెదడు, గుండె పనితీరును పెంచుతాయి.
శరీరం చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పనిచేయాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఏ విటమిన్, మినరల్స్ లోపం ఏర్పడినా కూడా దాని ప్రభావం అవయవాలపై చాలా ఎక్కువగానే ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు, మినరల్స్ ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అంతే అవసరం. ఈ కొవ్వులలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఒకటి. శరీరంలో ముఖ్యంగా ఒమేగా 3 లోపం ఏర్పడినప్పుడు అవయవాలు ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉండేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఒమేగా 3 ఆమ్లాలు తక్కువగా ఉంటే శరీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఒమేగా 3, ఒమేగా 6 శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు. వీటిని బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అని కూడా పిలుస్తారు. శరీరంలో మంట తగ్గించేందుకు కూడా ఈ ఆమ్లాలే సహకరిస్తాయి. వీటిని సాల్మన్, ట్యూనా, సార్టినెస్ వంటి జిడ్డు చేపల ద్వారా పొందవచ్చు. చియా, అవిసె గింజలు, వాల్ నట్స్ లోనూ ఒమేగా 3 ఉంటుంది. ఈ కొవ్వు ఆమ్లాలు శరీరంలో రకరకాల విధులకు అవసరం. ఇవి మెదడు, గుండె పనితీరును పెంచుతాయి.
గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. కొలెస్ట్రాల్ నియంత్రించడం ద్వారా గుండె వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించి బీపీని బ్యాలెన్స్ చేయడంలో ఒమేగా 3 పాత్ర ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డకట్టడం, వాపును తగ్గించడం కూడా చేస్తుంది.
Health Tips : అవిసె గింజలతో ఇన్ని ప్రయోజనాలా.. ఇవి తింటే కీళ్ల నొప్పులు ఉండవా..!
ఒమేగా శరీరంలో లోపిస్తే..
1. ఒమేగా లోపిస్తే రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. చాలా త్వరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
2. పిరియడ్స్, గర్భధారణ సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.
3. ఒమేగా 3 తక్కువగా ఉన్నట్లయితే మెదడు పనితీరులో ఇబ్బందులు ఉంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది. ఏ విషయం పైనా దృష్టి ఉంచలేరు.
Health Tips : ఒత్తిడిగా అనిపిస్తే నోరు పొడిబారుతుందా.. ఇది ఇంకా దేనికి సంకేతం..!
4. విపరీతమైన కోపం, చికాకు, ఆందోళన కూడా ఒమేగా 3 లోపిస్తే కలిగే ఇబ్బందులు.
5. మూత్రపిండాల పనితీరు సరిగా ఉండదు. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.
6. ఒమేగా 3 లోపిస్తే కళ్ళు పొడిబారడం, కంటిలో శుక్లాలు వస్తాయి.
Health Tips : నిద్ర పక్షవాతం గురించి ఈ విషయాలు తెలుసా...!
శరీరంలో ఏ విటమిన్, మినరల్ లోపించినా కూడా అన్ని అవయవాలకు ఇబ్బంది తప్పదు. సరైన విధానంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. దీనితోపాటు ప్రతి ఆరు నెలలకు ఒకమారు డాక్టర్ పర్యవేక్షణ, వైద్య పరీక్షలు తప్పనిసరిగా పాటించాలి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.