Share News

Healthy Recipe : రాగి మొలకల జావ

ABN , Publish Date - Oct 29 , 2024 | 04:52 AM

రక్తహీనత తొలగాలంటే ఐరన్‌ ఎక్కువగా తీసుకోవాలి. రాగులను ఎండబెట్టి, పిండి కొట్టించి వాడుకోడానికి బదులుగా,

Healthy Recipe : రాగి మొలకల జావ

హెల్తీ రెసిపి

క్తహీనత తొలగాలంటే ఐరన్‌ ఎక్కువగా తీసుకోవాలి. రాగులను ఎండబెట్టి, పిండి కొట్టించి వాడుకోడానికి బదులుగా, వాటిని మొలకెత్తించి జావ కాచుకుంటే, సమృద్ధిగా ఐరన్‌ సమకూరి, రక్తహీనత తొలగిపోతుంది.

  • రాగులను శుభ్రం చేసుకుని, రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.

  • మరుసటి రోజు శుభ్రమైన పలుచని కాటన్‌ టవల్‌లో రాగులను మూటగట్టి పైన బరువుంచాలి.

  • తర్వాతి రోజుకి రాగులు మొలకెత్తుతాయి.

  • ఇలా మొలకెత్తిన రాగులను ఒక రోజంతా నీడలో ఎండబెట్టి, పిండి కొట్టుకోవాలి.

  • ఈ పిండితో జావ లేదా సంకటి తయారు చేసుకుంటే రెట్టింపు పోషకాలు, ఐరన్‌ అందుతాయి.

Updated Date - Oct 29 , 2024 | 04:52 AM