Share News

ఇవి ఔషధాలు...

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:20 AM

మన వంటింట్లో అనాదిగా ఉపయోగిస్తున్న అద్భుత పదార్థం పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్స్‌ అధిక మొత్తంలో ఉంటాయి.

ఇవి ఔషధాలు...

మీకు తెలుసా!

న వంటింట్లో అనాదిగా ఉపయోగిస్తున్న అద్భుత పదార్థం పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్స్‌ అధిక మొత్తంలో ఉంటాయి. మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు, వృద్ధాప్యపు ఛాయలు, సొరియాసిస్‌ వంటి అనేక చర్మ సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. రోజూ వంటల్లోనే కాకుండా పాలల్లో కూడా పసుపు వేసుకొని తాగితే మంచి ఫలితాలుంటాయి.

తులసిలో విటమిన్‌ కె, యాంటీఆక్సిడెంట్స్‌ అధికం. ఇది రక్తప్రసరణను ప్రేరేపించి జుత్తు పెరగడానికి ఉపకరిస్తుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై నల్లమచ్చలు, మొటిమలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో దోహదపడతాయి.

చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో వేప ఆకు బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై మంట తగ్గిస్తుంది. వేప కలిపిన నీటితో స్నానం చేస్తే ఎన్నో చర్మ వ్యాధులను దూరంగా పెట్టచ్చు. వేపలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీవైరల్‌ లక్షణాలు అధికం.

Updated Date - Nov 11 , 2024 | 02:20 AM