Winter skin care: చలికాలంలో 'సబ్బు'కు బదులుగా ఇది ఉపయోగించండి..
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:11 PM
శీతాకాలంలో 'సబ్బు'కు బదులుగా కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించడం చాలా మంచిది. చల్లటి గాలి వల్ల ముఖ సౌందర్యం మసకబారకుండా సబ్బుకు బదులుగా ఇది ఉపయోగించండి.
Winter skin care: శీతాకాలంలో 'సబ్బు'కు బదులుగా కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించడం చాలా మంచిది. చల్లటి గాలి వల్ల ముఖ సౌందర్యం మసకబారకుండా సబ్బుకు బదులుగా ఇది ఉపయోగించండి. సీజన్‌ను బట్టి మనం చర్మానికి ఉపయోగించే ఉత్పత్తులలో మార్పు తీసుకోవాలి. ఈ చలికాలంలో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి, చర్మానికి మాయిశ్చరైజ్ చేసే ఉత్పత్తులు వాడాలి. కొంతమందికి ఈ చలికాలంలో స్నానం చేసిన తర్వాత చర్మంపై సబ్బు తేలిపోయి చర్మం పొడిగా మారుతుంది. చాలా మంది చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కారణంగా కూడా చర్మం నుంచి మిగిలిన తేమ కూడా హరించుకుపోతుంది.
సున్నిపిండితో స్నానం..
మనలో చాలా మంది ఎప్పుడూ ఒకే రకమైన సబ్బును వాడుతారు. ఎందుకంటే వేరే సబ్బు వాడితే వారికి ఏమైన అలర్జీ వస్తుందోనని భావిస్తారు. అయితే, మీరు ఈ సబ్బులతో ఇబ్బంది పడుతుంటే, సబ్బుకు బదులుగా ఉబ్తాన్‌ని ఉపయోగించండి. ఇది చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేసిన తర్వాత కూడా చర్మం మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లోకి ఎన్నో రకాలైన సబ్బులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఉపయోగించే రసాయనాలు.. అన్ని చర్మ రకాలకు సరిపోతాయన్న గ్యారెంటీ లేదు. పూర్వంలో మన పెద్దలు సబ్బులు లేనపుడు నలుగుపిండి లేదా సున్నిపిండితో స్నానం చేసేవారు. దీనినే ఇప్పుడు ఉబ్తాన్ అని కూడా పిలుస్తున్నారు.
నలుగుపిండి..
కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి ఇంట్లోనే నలుగుపిండి తయారు చేసుకోవచ్చు. ఇది సహజమైనది కాబట్టి అన్ని చర్మ రకాలకు ఎంతో మేలు చేస్తుంది. మీరు స్నానం చేయడానికి సబ్బుకు బదులుగా ఇంట్లోనే తయారు చేసిన నలుగుపిండిని ఉపయోగిస్తే చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చర్మంలోని డెడ్ స్కిన్ కూడా క్లీన్ అవుతుంది. దీంతో చర్మం శుభ్రపడుతుంది. దీని కారణంగా చర్మం మృదువుగానే మారడం కాకుండా సహజమైన మెరుపు కూడా వస్తుంది.
(Note: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ వీటిని ధృవీకరించలేదు.)