Water Benefits : నీళ్లతో నూరు లాభాలు
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:01 AM
నీటితో వంద లాభాలు
వాటర్ రెమిడీస్
పుదీనా నీరు: శరీరమంతా డిటాక్స్ అవుతుంది. జీర్ణశక్తి పెరగడంతో పాటు, హైడ్రేషన్ కూడా వృద్ధి అవుతుంది. ఇందుకోసం కొన్ని పుదీనా ఆకులను నీళ్లలో వేసి కాచి, చల్లార్చి, వడగట్టి తాగాలి.
నిమ్మ నీరు: పొట్ట చదునుగా మారుతుంది. చర్మం కాంతులీనుతుంది. వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని పరగడుపునే తాగాలి.
జీలకర్ర నీరు: జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతారు. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుంది. ఇందుకోసం గ్లాసు నీళ్లలో టీస్పూను జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తాగాలి.
అల్లం నీళ్లు: జలుబు, తలనొప్పి, కడుపుబ్బరానికి విరుగుడుగా పని చేస్తాయి. గ్లాసు నీళ్లలో చెంచా అల్లం రసం కలిపి తాగాలి.