Share News

Navya : తగ్గితే ఎందుకు మంచిది

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:17 AM

ఒక ఊరిలో జగ్గు, రంగా అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిద్దరు మాటిమాటికీ కారణం లేకున్నా గొడవలు పడుతుండేవారు.

Navya :  తగ్గితే ఎందుకు మంచిది

క ఊరిలో జగ్గు, రంగా అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు వారిద్దరు మాటిమాటికీ కారణం లేకున్నా గొడవలు పడుతుండేవారు. ఎంతమంది మందలించినా, వారిద్దరూ తమ వైఖరి మార్చుకోలేదు. ఆ ఊరివారు ఊరు చివరనున్న చెరువులోనుంచి తాగడానికి నీళ్లు తెచ్చుకునే వారు.

ఆ చెరువుకు వెళ్లే దారి కొండ మీదుగా చాలా సన్నగా, ఇరుగ్గా ఉండేది. కొంచెం పక్కకు జరిగితే కొండ మీదినుండి పడిపోయే విధంగా ఉన్న ఆ దారిలో ఒక రోజు జగ్గు నీళ్ల కోసం వెళ్లాడు. అదే సమయానికి రంగా నీళ్ల్లు తీసుకుని వెనక్కి వస్తూ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు కానీ ఎవరూ వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇద్దరూ పట్టు తప్పి, కొండమీద నుండి కిందపడి దెబ్బలు తగిలించుకున్నారు.

కొన్ని పార్లు నెగ్గడానికి కాకుండా తగ్గడానికి ఇష్టపడితేనే బాగుపడతాం.

Updated Date - Jun 22 , 2024 | 12:17 AM