Technology : టెస్టింగ్‌లో ‘నోట్స్’
ABN , Publish Date - Jun 22 , 2024 | 01:18 AM
యూట్యూబ్ కొత్తగా ‘నోట్స్’ ఫీచర్‌ను తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎక్స్‌కు చెందిన కమ్యూనిటి నోట్స్ మాదిరిగానే ఉండనుంది.
యూట్యూబ్ కొత్తగా ‘నోట్స్’ ఫీచర్‌ను తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎక్స్‌కు చెందిన కమ్యూనిటి నోట్స్ మాదిరిగానే ఉండనుంది. వీడియోపై కాంటెక్స్ట్ రాసేందుకు ఇది వీలుకల్పిస్తుంది. మిస్‌లీడింగ్, ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని టాగ్ కూడా చేయవచ్చు. టెస్టింగ్ దశలో భాగంగా ముందుగా కొందరు యూజర్లు, క్రియేటర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. రెలవెంట్, టైమ్లీ, ఈజీ టు అండర్‌స్టాండ్ కాంటెక్స్ట్ వంటివి వీడియోలపై రాసే అవకాశం లభిస్తుంది. ఒక పాటకు పారడీ నుంచి ప్రొడక్ట్ న్యూవెర్షన్ రెవ్యూ, ఎప్పటిదో ఇప్పటిదంటూ పెట్టిన ఫుటేజీని గుర్తించడం వంటివన్నీ ఈ ఫీచర్‌తో తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇంగ్లీష్‌లో రాయవచ్చు. అమెరికాలోని మొబైల్ యూజర్లకు మొదట ఇది అందుబాటులోకి వస్తుంది. టెస్టింగ్ దశలో ఎవాల్యుయేటర్లు ఈ ఫీచర్‌కు రేటింగ్ ఇస్తారు. ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది తెలియజేస్తారు.