Pierre Poilievre: దీపావళి వేడుకలకు కెనడా ప్రతిపక్ష నేత గైర్హాజరు!
ABN , Publish Date - Oct 31 , 2024 | 07:22 AM
కెనడా ప్రతిపక్ష నేత పియెర్ పోలియేవర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. భారతతో దౌత్య వివాదం నేపథ్యంలో కెనడాలో స్థానిక భారత సంతతి వారు ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలకు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు.
ఇంటర్నె్ట్ డెస్క్: కెనడా ప్రతిపక్ష నేత పియెర్ పోలివెర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. భారతతో దౌత్య వివాదం నేపథ్యంలో కెనడాలో స్థానిక భారత సంతతి వారు ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలకు చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా సంస్థ పార్లమెంట్ హిల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఆయన హాజరు కాకపోవడం స్థానిక హిందువుల్లో కలకలానికి దారి తీసింది. అనేక మంది ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు (NRI).
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ దీపావళి వేడుక!
కెనడా సమాజంలో భారతీయ సంతతి వారి విషయంలో వేళ్లూనుకున్న పక్షపాత ధోరణికి ఇది అద్దం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత గైర్హాజరీ నేపథ్యంలో ఓఎఫ్ఐసీ అధ్యక్షుడు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ పరిణామంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా ప్రతిపక్ష నేత ఈ వేడుకలకు హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇంతటి ముఖ్య సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాకపోవడం.. భారత సంతతి వారిని సాటి కెనేడియన్లుగా చూడట్లేదన్న భావన కలిగించిందని అన్నారు. భారత దేశ రాజకీయపరమైన చర్యలతో తమకు సంబంధం ఉన్నట్టు చూస్తున్నారన్న భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి వేడుకల్లో రాజకీయ నేతలు పాలుపంచుకోకపోవడంతో తాము ఒంటరిగా మారామన్న భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
NRI: ఫిలడెల్ఫియాలో తానా సాంస్కృతిక పోటీలు
మరోవైపు, సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పియెర్ పోలియేవర్ కెనడా తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తాజా గణాంకాల ప్రకారం, కెనడా ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ జనామోదంలో ట్రూడో కంటే 20 పాయింట్ల ముందంజలు ఉంది. మరోసారి పీఎం పదవిని అధిష్టించాలని ప్రయత్నిస్తున్న ట్రూడోకు తగ్గుతన్న రేటింగ్స్ తో పాటు పార్టీలో అంతర్గత కలహాలు కూడా తలనొప్పిగా మారాయి.