Share News

NRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:25 PM

డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి (దుబాయి, యూఏఈ) వారి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవవంత్ రెడ్డికి టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు తెలిపింది.

NRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు

ఎన్నారై డెస్క్: డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా సమితి (దుబాయి, యూఏఈ) వారి ఆధ్వర్యంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు తెలిపింది (NRI). ఈ సందర్భంగా టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ దుబాయి ఎస్.వి రెడ్డి కేక్ కటింగ్, పాలాభిషేకం చేశారు. సభ్యులు ఎస్. వి. రెడ్డికి కూడా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఓడిపోయినా కూడా గల్ఫ్‌లో ఎప్పటికప్పుడు ప్రతి లేబర్ క్యాంప్ తిరిగి వారి సమస్యలను 'తెలుసుకొని పరిష్కారం దిశగా ఆలోచించేదని గుర్తు చేశారు.

NRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!


ఎన్నికల ముందు విధివిధానాలతో కూడిన గల్ఫ్ సంక్షేమ భోర్డు ఏర్పాటు చేస్తామని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన 9 నెలల్లోనే బోర్డును కాంగ్రెస్ ఏర్పాటు చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు 500 కోట్లతో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రమాణం చేసి రెండు సార్లూ మోసం చేశారని ఎస్.వి. రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం, ఇచ్చిన వాగ్దానం చేసి చూపించే పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎన్.నర్సయ్య, కోఆర్డినేటర్ జే.నారాయణ, సంఘం సభ్యులు, సాదతుల్లా, విజయ్, సుదర్శన్, రాజేష్ పంతులు గారూ, ఎడ్విన్, ప్రేమ్, రవి చంద్ర, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Sep 23 , 2024 | 03:41 PM