Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం
ABN , Publish Date - Jul 09 , 2024 | 02:55 PM
ఉన్నత విద్యా కోసం యూఎస్ వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
న్యూయార్క్, జులై 09: ఉన్నత విద్యా కోసం యూఎస్ వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో ఆదివారం చోటు చేసుకుంది. సాయి సూర్య అవినాష్ గద్దె.. అల్బనిలోని బార్బర్‌విల్లే పాల్స్ వద్ద నడుస్తూ ప్రమాదవశాత్తు వాటర్ పాల్స్‌లో కాలు జారీ పడ్డడంతో.. నీటి మునిగి మరణించాడు.
ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబారి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. మృతుడు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లా అని తెలిపింది. 2023లో యూఎస్ వచ్చిన అతడు.. న్యూయార్క్‌లోని టైన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడని వివరించింది.
Also Read: SIT's Report: హాత్రాస్ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!
అవినాష్ గద్దె మృతి పట్ల అతడి కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులకు న్యూయార్క్‌లోని భారత రాయబారి కార్యాలయం ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది.
మరోవైపు.. అవినాష్ గద్దె మృతిపై న్యూయార్క్‌లోని స్థానిక మీడియా స్పందించింది. బార్బర్ విల్లే వాటర్ ఫాల్స్‌లో ఒక వ్యక్తి నీటి మునిగి మరణించాడని తెలిపింది. మరో వ్యక్తిని మాత్రం స్థానికులు రక్షించారని వెల్లడించింది. అయితే నీటి మనిగి మరణించి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదంటూ ది రెన్సీలర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇక అవినాష్ గద్దె దుర్మరణంపై స్థానిక అధికారులు విచారణ జరపుతున్నారు.