NRI TDP: లండన్‌లో కోడెల శివరాం.. ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు..
ABN , Publish Date - Oct 12 , 2024 | 07:51 PM
UK NRI TDP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ లండన్ పర్యటనలో ఉన్నారు. శివరామ్ కు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత పద్మభూషణ్ రతన్ టాటా చిత్రపటానికి..
UK NRI TDP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ లండన్ పర్యటనలో ఉన్నారు. శివరామ్ కు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత పద్మభూషణ్ రతన్ టాటా చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే స్వర్గీయ నందమూరి తారకరామారావు, కోడెల శివప్రసాద్, లగడపాటి అంజిబాబు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శివరామ్ మాట్లాడుతూ.. ‘టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలందరి మన్ననలు అందుకుంటోంది. ఇది మంచి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు. ప్రగతి ఎజెండాగా, రాష్ట్ర పౌరుల భవిష్యత్ బాగుండాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబు, యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ పై ప్రజలలో అపారమైన నమ్మకం వుంది. అందుకే.. దేశంలో ఎక్కడా లేని విధంగా వన్ సైడ్ విక్టరీని ప్రజలు టీడీపీ కూటమికి కట్టబెట్టారు.’ అని చెప్పారు.
‘2019 వైసీపీ ప్రభుత్వం పాలనలోకి రాగానే.. తన పదవి రాజీనామా అనంతరం తమ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తీసుకునివెళ్ళమని అధికారులకు తెలియజేసినా.. కనీస సమాధానం ఇవ్వకుండా, రాజకీయ కక్ష్యలలో, 40 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవలో ఉన్న ఒక రూపాయి డాక్టర్‌గా గుర్తింపు పొందిన కోడెల శివప్రసాద్ మీద కేసులు పెట్టి, మానసికంగా హింసించి సర్కారు ఏ విధంగా హత్య చేసింది మీ అందరికీ తెలుసు.’ అని తన తండ్రిని తలుచుకున్నారు శివరామ్.
‘భగవంతుడు అన్నీ చూస్తుంటాడు. ధర్మం ఎప్పుడూ అధర్మంపై విజయం సాదిస్తూనే ఉంటుంది. ఈ రోజు జగన్ రూ. 30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ సొమ్ము ఇంట్లో పెట్టుకున్నాడు. ఆనాడు కోడెల శివప్రసాద్‌పై మోపిన నిందలు తప్పు అనే కనీస పాప భీతి కూడా లేకుండా బతుకున్నాడు.’ అని జగన్ తీరుపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే ప్రజల్లో విలువ, అభిమానం ఎన్నటికీ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూకే ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, డా. కోగంటి రామకోటయ్య దంపతులు, యువనాయకులు రాణా, ఎన్ఆర్ఐ టీడీపీ యూకే సీనియర్ నాయకుడు గుంటుపల్లి జయకుమార్, గోగినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Also Read:
ప్రపంచకప్ ఫైనల్లో యాక్టింగ్.. ఆ గాయం నిజమైనది కాదు..
పోలీస్ స్టేషన్‌లో పురోహితుడి కత్తి విన్యాసం.. వైరల్ వీడియో
తుపాను హెచ్చరిక.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు..
For More NRI News and Telugu News..