NRI: ఏపీ సీఎం సహాయనిధికి ‘నాక్స్’ రూ.30 లక్షల విరాళం
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:44 PM
నార్త్ అమెరికా కమ్మ సంఘం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సీఎం వరద సహాయ నిధికి రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చింది.
ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాల కాలంలో ఎన్నడూలేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, బుడమేరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో వరద నీటి ఉగ్రతకు వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తుండగా, ప్రైవేటు వ్యక్తులు, అనేక సంస్థలు కూడా సహాయక చర్యల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు (NRI).
అమెరికాలో ఉన్న NAKS ( నాక్స్ -నార్త్ అమెరికా కమ్మ సంఘం) సంస్థ వారు కూడా రాష్ట్ర ప్రజలకు తమ వంతు సహాయం అందించటం కోసం రూ. 30 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. దాతల సహకారంతో సేకరించిన ఈ మొత్తాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సీఎం వరద సహాయ నిధికి అందించారు.
NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం
ఈ సందర్భంగా సంస్థ సభ్యులను ప్రెస్ పలకరించగా, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దేశం బయట ఉన్నప్పటికీ తమ మనసు ఎల్లప్పుడూ దేశ రాష్ట్ర సమాజ హితం కోరుకుంటుందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ పరస్పర గౌరవం , పరస్పర సహాయ సహకారంతోనే సమాజం ముందుకెళ్లగలదని చెప్పారు. ఈ వరద కష్టాలనుండి ప్రజలకు త్వరగా ఉపశమనం కలగాలని తాము భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు.
Bahrain: తెలుగు కళా సమితిలో మార్మోగిన గణపతి బప్పా
విరాళాల సేకరణలో సహకరించిన సభ్యులు శ్రీనివాస్ ఉయ్యురు, సురేష్ చన్నమల్లు, అశోక్ కొల్లా, అనిల్ చిమ్మిలి, ప్రుదేశ్ మక్కపాటి, శివ మొవ్వ, భానుప్రకాష్ గుళ్లపల్లి, భూషణ్ పాలడుగు, సురేంద్ర పాలడుగు, కృష్ణ నాయుడు, కోటేశ్వరరావు కందిమళ్ల, స్వాతి పోలవరపు, నర్రా వెంకట్, ఉన్నం లక్ష్మీనారాయణ, నరేష్ గొల్ల, లక్ష్మణ్ పర్వతనేని, అక్షర చేబ్రోలు, కిషోర్ తమ్మినేని, రంజిత్ కోమటి, వెంకట్ ప్రేమ్‌చంద్ తానికొండ, దాతలకు NAKS ( నాక్స్ - నార్త్ అమెరికా కమ్మ సంఘం) సంస్థ తరపున ధన్యవాదాలు తెలియచేశారు.
AP: ఐటీసర్వ్ అలయన్స్ సినర్జీ కాన్ఫరెన్స్.. ఏపీ సీఎంకు ఆహ్వానం!