Share News

TDP: ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. అట్లాంటాలో తెలుగు మహిళల సంబరాలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:50 PM

దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పుతో, అట్లాంట తెలుగుదేశ ఆడపడుచులు, వీర మహిళలు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు.

TDP: ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. అట్లాంటాలో తెలుగు మహిళల సంబరాలు
NRIs Celebrate TDP Victory in elections

ఎన్నారై డెస్క్: దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పుతో, అట్లాంట తెలుగుదేశ ఆడపడుచులు, వీర మహిళలు (NRI) అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు. భారత దేశంలో ముఖ్యంగా ఏపీలో జరిగే ఏ విషయాన్ని అయినా సునిశితంగా పరిశీలిస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాంధ్రులలో ముఖ్యులు అట్లాంటా తెలుగు ప్రజలు ఈ ఎలక్షన్స్ లో కూడా ముఖ్య భూమిక పోషించారు. దాని ఫలితంగా లభించిన విజయాన్ని ఆస్వాదించటానికి "నారీ శక్తి" కదిలింది.

అట్లాంటాలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించే సంక్రాంతి రెస్టారంట్ యాజమాన్యం , కాట్రగడ్డ కవిత , నిమ్మగడ్డ శ్రీనివాస్ ఈ ఈవెంట్ కి , సకల సదుపాయాలు అందించారు. డేసిషన్‌తో మహిళలందరిని ఒక తాటి మీదకు తీసుకు వచ్చి, వారి ఆనందాన్ని అందరితో పంచుకోవటానికి భాగస్వాములైన కాకాని మాధవి, కాట్రగడ్డ కవిత, ఆలూరి ఉష, వీరిశెట్టి వేద, ఆలోకం సుజాత తదితరులను విచ్చేసిన వారందరు అభినందించారు.

NRI: ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం.. గల్ఫ్‌లో సంబరాలు

a1.jpg


కార్యక్రమ నిర్వహణ భాద్యత తీసుకున్న ఆలోకం సుజాత.. నందమూరి తారక రామారావు ప్రతిమ ముందు విజయ దీపారాధన చేయటానికి పెద్దల్ని ఆహ్వానించారు. ఐదు సంవత్సరాలుగా గూడు కట్టిన బాధ, అవమానం, నిర్వీర్యమైపోతున్న రాష్ట్రాన్ని నిశ్చేష్ఠులై చూసిన తరువాత వచ్చిన విజయం తాలూకా ఆనందం ప్రతి ఒక్కరి మోములో తొణికిసలాడింది. ఎట్టకేలకు రాష్ట్రం మళ్ళీ భావితరాల అభ్యున్నతికి బాటలు వేస్తూ, ప్రజాహితమైన సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకు పోయే నైపుణ్యం, పరిపాలనా దక్షత ఉన్న నాయకుడి చేతుల్లోకి మళ్ళీ రావటంతో ఊపిరి పీల్చుకుంటూ ఆనందంతో కొత్త పుంతలు తొక్కిన తీరు పండుగ వాతావరణాన్ని మించి కనిపించింది.

ఈ సందర్బంగా అట్లాంటా వాసి ఐన వెనిగండ్ల రాము విజయం(గుడివాడ MLA) గురించి, వారితో తమకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాక పలువురు వారి వారి స్వానుభవాలని అందరితో పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ MLC పంచుమర్తి అనురాధ వీడియో కాల్‌లోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలలో ప్రవాసాంధ్రుల పాత్రను కొనియాడారు. తరువాత రాష్ట్రాభివృద్ధికి వారి ముందున్న ప్రణాళిక గురించి కొద్ది సేపు వివరించారు. చివరిగా టీడీపీ , జనసేన , బీజేపీ (మహాకూటమి) కేకులు కోసి ఒకరికొకరు పంచుకుని, ఆనంద నృత్యాలతో ప్రాంగణాన్ని దద్దరిల్లింప చేసి , ఇటువంటి నారీ శక్తి ని ప్రదర్శించే కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 04:53 PM