NRI: కాంబోడియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించాం: విదేశాంగ శాఖ
ABN , Publish Date - Mar 30 , 2024 | 10:13 PM
కాంబోడియాలో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశానికి సురక్షితంగా తరలించామని విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది.
ఎన్నారై డెస్క్: కాంబోడియాలో (Cambodia) చిక్కుకుపోయిన ఎన్నారైలను (NRI) స్వదేశానికి సురక్షితంగా తరలించామని విదేశాంగ శాఖ (Ministry of External Affairs) శనివారం ప్రకటించింది. మొత్తం 250కి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చినట్టు వెల్లడించింది. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాల పేరిట మోసగాళ్లు భారతీయులను కాంబోడియాకు రప్పించారని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. ఆ తరువాత వారిని బలవంతంగా చట్టవ్యతిరేక సైబర్ కార్యకలాపాల్లో దింపారని తెలిపారు (NRIs in Cambodia Rescued).
కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు
‘‘ఎన్నారైల అవస్థల గురించి మీడియాలో వార్తలు రాగానే కాంబోడియాలోని ఎంబసీ స్పందించింది. స్థానిక అధికారులతో కలిసి మొత్తం 250 మంది భారతీయులను కాపాడి స్వదేశానికి తరలించాము. వీరిలో 75 మంది ఇటీవలే భారత్‌కు వచ్చారు. కాంబోడియాలో ఇబ్బందుల్లో పడ్డ ఎన్నారైలను రక్షించేందుకు మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ మోసాలకు బాధ్యులైన వారిని స్థానిక అధికారులతో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాము’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాల గురించి గతంలోనే అనేక సార్లు హెచ్చరించామని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి