NRI: సింగపూర్‌లో స్వర లయ ఆర్ట్స్ నిర్వహణలో 2వ వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాలు
ABN , Publish Date - Mar 21 , 2024 | 04:06 PM
ఈ నెల (మార్చి) 18వ తారీఖున స్వర లయ ఆర్ట్స్ (సింగపూర్) వారి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకున్నారు.
ఎన్నారై డెస్క్: ఈ నెల (మార్చి) 18వ తారీఖున స్వర లయ ఆర్ట్స్ (సింగపూర్) వారి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకున్నారు.
సంగీత సాగరంలో ఓలలాడి, రామభక్తిలో మునిగి తేలుతూ, యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి, షర్మిల, సౌమ్య, కిరిటి, శేషశ్రీ తదితరులు ఘన రాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. యడవల్లి శ్రీ విద్య ‘తెర తీయగ రాదా’ అను కీర్తనతో స్వామిని కొలువగా, ఆరగింపవే అను భక్తి నైవేద్యాలతో, పతికి మంగళ హారతీరే అంటూ మంగళ హారతులతో అందరూ త్యాగరాజ స్వామి ఆరాధనలు మిక్కిలి భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు.
అనంతరం స్వర లయ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన శేషు కుమారి సంగీతజ్ఞులకు మొమెంటోలను బాహుకరించి సత్కరించారు.
NRIs Rally: ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని అమెరికా, యూకేలో ర్యాలీ, ప్రార్థనలు