NRI: దుబాయిలో తెలుగు ప్రవాసీకి యూఏఈ ఐకన్ ఆవార్డు
ABN , Publish Date - Oct 04 , 2024 | 06:59 AM
సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది (NRI).
దుబాయిలోని ఒక సంస్థ, ఇండియా టుడే గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీనివాస గౌడ్‌కు ఈ ఆవార్డును ప్రదానం చేసారు. కార్యక్రమంలో ఇండియా టుడే ప్రతినిధులు, భారతీయ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.
NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అంచలంచెలుగా బ్యాంకింగ్ రంగంలో స్విట్జర్లాండ్‌లోని ఒక ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకింగ్ సంస్థలో పెట్టుబడుల సలహాదారుడిగా ఎదిగారు. ఆ తర్వాత సొంతంగా పెట్టుబడుల సలహాలతో పాటు బ్యాంకులకు సాంకేతిక సేవలందించే మెంసా అనే సంస్థను ఆయన దుబాయిలో నెలకొల్పగా అది దుబాయితో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలోని బ్యాంకులకు సాంకేతిక సేవలందిస్తోంది.
NRI: ప్రవాసీ ప్రజావాణిలో సౌదీ అరేబియా నుండి ఫిర్యాదు!
దుబాయిలోని తెలుగు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్ గౌడ్‌ను పలువురు తెలుగు ప్రముఖులు అభినందించారు. ఆయన ఇంట్లో ఏటా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో భారతీయ ప్రముఖులతో పాటు విదేశీ అతిథులు కూడా పాల్గొంటారు. ఆయన భార్య ప్రియాంక, కూతుళ్ళు శ్రీనిక, సితారలు కూడా ఆయనకు చేదోడువాదోడుగా ఉంటారు.