NRI: సంతానం కడచూపులకు నోచుకోక గల్ఫ్‌లో అలమటిస్తున్న ఎన్నారైలు!
ABN , Publish Date - Oct 04 , 2024 | 07:17 AM
వీసా నిబంధనల కారణంగా సౌదీలో చిక్కుకుపోయిన ఇద్దరు తెలుగు ప్రవాసీయులు తమ సంతానం కన్నుమూసినా ఇండియాకు రాలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
వలస యాత్రలో అంతిమ యాత్రకు దక్కని ఆవకాశం
వీసా నిబంధనల కారణంగా రాలేని ఇద్దరు తండ్రుల ఆవేదన
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రాణాలకంటే మిన్నదైన తన ఏకైక సంతానమైన నాలుగేళ్ళ చిన్నారి స్వదేశంలో బతుకమ్మకు సంసిద్ధమవుతూ స్కూల్ వ్యాన్ కింద పడి మరణిస్తే ఆమెను కడసారి చూడడానికి రాలేక తీవ్ర ఆవేదనలో ఒక తండ్రి! ఎదిగిన కొడుకు వినాయక చవతి ఏర్పాట్లలో ట్రాక్టర్ క్రింద పడి ప్రాణాలు కోల్పోయితే తన చేతులారా పాడే మోయాలని మరో తండ్రి..! కడసారి చూపుల కోసం మాతృదేశానికి వెళ్ళడానికి ఈ ఇద్దరు గత కొన్ని రోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
దుబాయిలో తెలుగు ప్రవాసీకి యూఏఈ ఐకన్ ఆవార్డు
పురపాలక పారిశుధ్య కార్మికులుగా పని చేయడానికి సౌదీ అరేబియాకు వచ్చిన రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఈ ఇద్దరి పిల్లలు వారి స్వస్థలాల్లో వేర్వేరు ప్రమాదాలలో మరణించగా వారిని చూడడానికి వీరు గత కొన్ని రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో మున్సిపల్ పారిశుధ్య కార్మికునిగా పని చేయడానికి వచ్చి పారిపోయి చట్టవిరుద్ధంగా ఉంటున్న ముస్తాబాద్ మండలానికి చెందిన సలకం భీమయ్య (భూమరాజు) ఏకైక సంతానమైన మనోజ్ఞ (5) సోమవారం స్వస్థలంలో స్కూల్ బస్సు క్రింద పడి మరణించింది. పాఠశాలలో బతుకమ్మ పోటీలకు సంసిద్ధమవుతున్న అమె స్కూల్ బస్సు కింద పడి కన్నుమూసింది. అఖమా గడువు స్వదేశానికి పంపిచాలంటూ రోదిస్తూ ఆయన తెలిసిన వారందర్నీ ప్రాధేయపడుతున్నారు.
NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’
అదే విధంగా, ఏల్లారెడ్డిపేట మండలం ధుమాల గ్రామానికి చెందిన నలకొండ రఘుపతి గత రెండేళ్ళుగా మున్సిపాల్టీలో చట్టబద్ధంగా పని చేస్తుండగా ఇతని వీసాలో ఏ సమస్య లేదు. ఈయన కొడుకు రాకేశ్ స్వగ్రామంలో వినాయకుని ఊరేగింపు సన్నాహాలు చేసే క్రమంలో ట్రాక్టరు ఇంజన్ పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా ఇంజన్ ఆన్ అయ్యి వాహనడం ముందు నడవడంతో ఆయన ట్రాక్టరు మీద నుండి ప్రాణాలు కోల్పోయాడు. వినాయక చవితి నుండి ఇప్పటి వరకు రఘుపతి నిత్యం ఆవేదనతో తిరుగుతున్నా కంట్రాక్టు పూర్తి కాలేదనే సాకుతో యాజమాన్యం పంపించడంలో జాప్యం చేస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి యాజమాని అనుమతి తప్పని సరి.
తమ పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వీరివురూ వీసా వ్యూహంలో ఇరుక్కొని విలవిలాడుతున్నారు. ఆకలి, మానసిక వ్యధతో నగిలిపోతున్నారు. ఇక్కడి వీసా చట్టాల కారణంగా వీరికి భారతీయ ఎంబసీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది.