UK Visa: వీసా ఆంక్షలతో బ్రిటన్‌కే చేటు.. పరిశీలకుల హెచ్చరికలు
ABN , Publish Date - Feb 27 , 2024 | 09:07 PM
వలసలపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు అక్కడి ఉన్నత విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అక్కడి పరిశీలకులు అంటున్నారు.
ఎన్నారై డెస్క్: వలసలపై బ్రిటన్ (UK) ప్రభుత్వ ఆంక్షలు (Immigration Restrictions) అక్కడి ఉన్నత విద్యాసంస్థలపై ప్రతికూల ప్రభావం (Negative Impact) చూపిస్తాయని బ్రిటన్‌లోని కాన్‌టాబ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు ఇవాన్ కర్క్ అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్న బ్రిటన్ లక్ష్యానికి ఇది గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు.
NRI: అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు
బ్రిటన్‌లో వలసలకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. గతేడాది వలసలు రికార్డు స్థాయిలో 7,45,000కు చేరుకున్నాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల కట్టడి కోసం సొంత పార్టీలోని సంప్రదాయకవాదులు ప్రధాని రిషి సునాక్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వలసలపై ఆంక్షలకు తెరలేపింది.
వీసా ఆంక్షల కారణంగా దేశంలోకి అంతర్జాతీయ విద్యార్థుల రాకడ తగ్గితే యూనివర్సిటీ ఆదాయం తగ్గుతుందని, ఫలితంగా బ్రిటన్ సంస్థలకు నిపుణులైన సిబ్బందికి కొరత ఏర్పడుతుందని ఇవాన్ కర్క్ పేర్కొన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలవాలంటే మానవవనరులు కావాలని, నిపుణులందరూ దేశీయంగా లభించడం సాధ్యం కాదని చెప్పారు. బ్రిటన్ లక్ష్యాలు నెరవేరాలంటే విదేశీ నిపుణులు కూడా అందుబాటులో ఉండాలని కర్క్ పేర్కొన్నారు.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి