కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ..

ABN, Publish Date - Aug 06 , 2024 | 10:44 AM

అమరావతి: కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత అమరావతి సచివాలయంలో సోమవారం జరిగిన తొలి కలెక్టర్ల సదస్సు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ‘సూటిగా... సుత్తిలేకుండా’ సాగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి.. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. అధికార దర్పానికి దూరంగా ఉండాలని... పేదలకు దగ్గర కావాలని సూచించారు. ఎమ్మెల్యేలూ, మంత్రులకూ ఇదే చెప్పారు. ‘మా ప్రభుత్వ విధానం, మా లక్ష్యాలు ఇవి! మీరు వినూత్నంగా ఆలోచించండి. మనసుపెట్టి పని చేయండి. ఫలితాలు సాధించండి’ అని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు.

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 1/7

కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత జరిగిన తొలి కలెక్టర్ల సదస్సులో అందరికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 2/7

కలెక్టర్ల సమావేశానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలికిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.. ప్రక్కన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 3/7

కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రక్కన డిప్యూటీ సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, మంత్రులు..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 4/7

కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రక్కన సీఎం చంద్రబాబు, సీఎస్, ఏపీ డీజీపీ తదితరులు..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 5/7

సెక్రటేరియట్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సుకు హాజరైన కూటమి మంత్రులు..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 6/7

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి హాజరైన కలెక్టర్లు, పలువురు ఉన్నతాధికారులు..

 కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. 7/7

కలెక్టర్ల సమావేశం అనంతరం విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు..

Updated at - Aug 06 , 2024 | 10:44 AM