రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 13 , 2024 | 07:33 AM
అమరావతి: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రెండోరోజు జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ఆ వివరాలతో వచ్చే కలెక్టర్ల సమావేశానికి రావాలని, ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా వివరాలు నమోదు చేయాలని చంద్రబాబు సూచించారు. జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated at - Dec 13 , 2024 | 07:36 AM