Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు..

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:21 AM

పిఠాపురం: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజక వర్గంలోని యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. మహిళలు, రైతులు, కార్మికులు, యువత.. ఇలా వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని వారికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రజల సమస్య లు పరిష్కరిస్తానని, నియోజవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 1/7

వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం నియోజకవర్గం . పొన్నాడ గ్రామం, మూలపేటలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 2/7

పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మహిళలు ఆహ్వానిస్తూ.. హారతి ఇచ్చి నీరాజనం పలుకుతున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 3/7

పిఠాపురం, పొన్నాడ గ్రామం, మూలపేటలో వారాహి విజయ యాత్రలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ.. చేయీ చేయి కలుపుకుని ముందుకు సాగుతున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 4/7

పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి గ్రామస్థులను పలకరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వారితో కూర్చుని ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 5/7

వారాహి విజయ యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్టంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. ప్రజలను పలుకరిస్తూ.. వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 6/7

పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామంలో... నాలుగో రోజు మంగళవారం పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొబ్బరి బోండాల వ్యాపారిని పరామర్శిస్తున్న దృశ్యం.

Pawan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన దృశ్యాలు.. 7/7

వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం నియోజకవర్గం . పొన్నాడ గ్రామంలో పంట పొలాలను పరిశీలించి.. అక్కడ రైతుతో మాట్లాడుతున్న దృశ్యం.

Updated at - Apr 03 , 2024 | 10:21 AM