Vikram: విజయవాడలో 'తంగలాన్' మూవీ టీమ్ సందడి..
ABN, Publish Date - Aug 13 , 2024 | 11:27 AM
విజయవాడ: విలక్షణ నటుడు, అపరిచితుడు మూవీ ఫేమ్ హీరో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం విజయవాడ నగరంలో ఆ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా బందర్ రోడ్డులోని గేట్ వే హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ప్రెస్ మీట్‌లో హీరో విక్రమ్ దర్శకుడు పా రంజిత్, హీరోయిన్ మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ మాట్లాడుతూ.. ఈనెల 15న చిత్రం ఐదు భాషల్లో విడుదలవుతుందని, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, నాన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారని, తంగలాన్ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరారు. ఇదొక ఎమోషనల్ సినిమా అని, కుటుంబ సమేతంగా చూడవచ్చునని అన్నారు.

‘తంగలాన్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విజయవాడలో సందడి చేస్తున్న విలక్షణ నటుడు, అపరిచితుడు మూవీ ఫేమ్ హీరో విక్రమ్..

తంగలాన్ చిత్రం హీరోయిన్ మాళవిక మోహనన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయవాడలో సందడి చేస్తున్న దృశ్యం..

విజయవాడ గేట్ వే హోటల్లో తంగలాన్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీమ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హీరో విక్రమ్..

ఓ అభిమానితో హీరోయిన్ మాళవిక మోహనన్...

విజయవాడ గేట్ వే హోటల్లో తంగలాన్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హీరో విక్రమ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హీరోయిన్ మాళవిక మోహనన్..

అంతకుముందు గాంధీనగర్‌లోని బాబాయ్ హోటల్‌లో చిత్ర యూనిట్ అల్పాహారం ఆరగించింది. చిత్ర యూనిట్‌తో సెల్ఫీలు దిగేందుకు చుట్టుముట్టిన అభిమానులు..
Updated at - Aug 13 , 2024 | 11:27 AM