తిరుపతి గంగమ్మ జాతర దృశ్యాలు..

ABN, Publish Date - May 20 , 2024 | 12:05 PM

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామ దేవతకు భక్తులందరు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది మే 14వ తేదీ అర్ధరాత్రి నుంచి గంగమ్మ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు జరగనున్నాయి. గ్రామదేవత వేడుకల నేపథ్యంలో తిరుపతి నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 1/6

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అర్ఛకుడు హారతి ఇస్తున్న దృశ్యం..

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 2/6

తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు..

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 3/6

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడిలో వివిధ వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు..

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 4/6

గంగమ్మ జాతర నేపథ్యంలో పురుషులే చీరలు కట్టుకుని వివిధ రకాల వేషాలతో జాతరలో సందడి చేస్తున్న దృశ్యం..

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 5/6

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో పిల్లలు జుత్తులు విరబూసుకుని బూతాల వేషాలతో జాతరలో కనువిందు చేస్తున్న దృశ్యం.

తిరుపతి  గంగమ్మ జాతర దృశ్యాలు.. 6/6

గంగమ్మ జాతరలో ఓ మహిళ తమ పిల్లల వంటిపై బొట్టులు పెట్టి.. తలపై బోనం కుండలు పెట్టి.. అమ్మవారి దర్శనానికి వచ్చిన దృశ్యం..

Updated at - May 20 , 2024 | 12:05 PM