విజయవాడలో 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:05 AM

విజయవాడ: తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన చిత్రాలకు మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉంది. కథల ఎంపికలో కార్తికి మంచి టేస్ట్‌ ఉంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మెయ్యళగన్‌’. తమిళంలో 27 విడుదల కాగా, 'సత్యం సుందరం’ టైటిల్‌తో తెలుగులో 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘96’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సి. ప్రేమ్‌ కుమార్‌ నవలగా రాసుకున్న కథను సత్యం సుందరం’ సినిమాగా తెరకెక్కించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆ చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Updated at - Oct 01 , 2024 | 10:05 AM